- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Diwali Skin Care Tips: దీపావళి ముగిసిందా? అందం-ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలంతా దీపావళి(Diwali) పండగను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ పండగ బిజీలో చాలా మంది స్కిన్ (Skin) గురించి పెద్దగా పట్టించుకోరు. బాణాసంచా కాల్చడం వల్ల చర్మంపై స్కిన్ పై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా స్వీట్స్(Sweets) కూడా తింటారు. వీటితో పాటు ఫ్రైడ్ ఫుడ్స్ (Fried foods) తినడం, లేట్ గా పడుకోవడం.. ఇలా కొన్ని పనులు చర్మానికి పలు సమస్యలు కొనితెచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాగా మీ స్కిన్ పునరుత్తేజం అవ్వడానికి ఈ టిప్స్ పాటిస్తే చాలు.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఈ విధంగా ఫేస్ కడగండి..
దీపావళికి స్కిన్ మొత్తం అధికంగా కాలుష్యాన్ని, దుమ్ము, ధూళిని ఎదుర్కొంటుంది. కాగా పండగ అనంతరం ఫేస్‌ను గట్టిగా రుద్దకుండా.. మృదువుగా శుభ్రం చేసుకోండి. సున్నితమైన ఫ్లేస్ కాబట్టి స్కిన్ ముఖంపై గట్టిగా రుద్దితే దురదలు, చర్మం పొడిగా మారడం లాంటివి జరిగి.. స్కిన్ డ్యామేజ్ అవుతుంది.
మేకప్‌కు బ్రేక్ ఇవ్వండి..
ఫేస్టివల్ కాబట్టి అందరిలో ఆకర్షణీయంగా కనిపించడం కోసం చాలా మంది మహిళలు మేకప్ తప్పకుండా వేసుకుంటారు. పైగా సెల్ఫీలు బాగా రావాలని మరింత మేకప్ వేస్తారు. కాగా దీపావళి అయిపోయినాక.. మరుసటి రోజు నుంచి వారం వరకు మేకప్ కు కాస్త బ్రేక్ ఇస్తే మంచిది. ఆ వారం రోజులు మాయిశ్చరైజర్లు వాడడం స్కిన్ కు మేలు.
వాటర్ అధికంగా తీసుకోవాలి..
చర్మంలోని వ్యర్థాలు బయటికి వెళ్లేందుకు బాడీ హైడ్రేటేడెట్ గా ఉండడం ప్రధానం. కాగా దీపావళి తర్వాత టాక్సిన్స్ బయటికి వెళ్లేందుకు, స్కిన్ లో తేమ మెరుగ్గా అయ్యేందుకు నీరు అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
కంటికి సరిపడా నిద్రపోవాలి..
మనిషికి తప్పకుండా 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. కానీ పండగ సమయంలో ఎక్కువగా పనులు ఉండటం కారణంగానో లేక అతిథులతో టైమ్ స్పెండ్ చేయడం, దీపావళిని ఎంజాయ్ చేయడం వల్ల సరిగ్గా నిద్రపోరు. కాగా పండగ పనులన్నీ పూర్తయ్యాక కొన్నిరోజుల వరకు టైమ్ కి తిని టైమ్ కు పడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
గ్రీన్ టీ తీసుకోండి..
ఎక్కువగా గ్రీన్ టీని బరువు తగ్గడానికి తాగుతుంటారు. అలాగే ఈ టీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్ ను తళతళ మెరిసేలా చేస్తాయి. దీపావళి పండగ తర్వాత గ్రీన్ టీ పౌడర్ ను యగర్ట్, పాలు,తేనెలో కలిపి.. ఫేస్ కు అప్లై చేస్తే దీనిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కిన్ కు సహాయపడతాయి. ఈ మాస్క్ ను పదిహేను నిమిషాలు ఉంచి కూల్ వాటర్ తో కడగాలి.
వర్కవుట్స్ తప్పనిసరి..
దీపావళి అనంతరం వ్యాయామం కచ్చితంగా చేయాలంటున్నారు నిపుణులు. వర్కవుట్స్ చేస్తే చెమట ఎక్కువగా బయటికి పోతుంది. దీంతో స్కిన్ పైన ఉన్న హోల్స్ క్లియర్ అవుతాయి. కాగా రోజుకు 45 నిమిషాలు వ్యాయామం చేయండి.
విటమిన్ సీ పీల్..
విటమిన్ సీ పీల్ చర్మానికి ఎంతో సహాయపడుతుంది. ఇది యూవీ డ్యామేజ్, ఫ్రీ రాడికల్స్, స్కిన్ పై ముడతల్ని తగ్గించడంలో మేలు చేస్తుంది. పండగ వేళ ఫేస్ పై ఎక్కువ కేర్ తీసుకోకపోవడం వల్ల స్కిన్ కాస్త దెబ్బతింటుంది కాబట్టి విటమిన్ సీ పీల్ ఉత్తమం మార్గం. ఇది పింపుల్స్, మచ్చలు తగ్గిస్తుంది. ఫేల్ మెరిసేలా చేయడంలో తోడ్పడుతుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.
Read More..
Toxin Detox : శరీరంలో టాక్సిన్లతో రిస్క్.. ఈ సూపర్ డ్రింక్స్‌తో ప్రాబ్లం క్లియర్!