ఉత్తమ సేవకు గుర్తింపు.. పేటలో ఆరుగురు ఆరుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతులు

by Satheesh |   ( Updated:2022-03-11 17:19:00.0  )
ఉత్తమ సేవకు గుర్తింపు.. పేటలో ఆరుగురు ఆరుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతులు
X

దిశ, సదాశివపేట: సదాశివపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు కానిస్టేబుల్‌లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతలు లభించాయి. ప్రమోషన్ పొందిన వారికి సీఐ సంతోష్ కుమార్ స్వీట్లు పంచి అభినందించారు. కానిస్టేబుల్‌గా ఇంతకాలం సక్రమంగా విధులు నిర్వహించి.. పోలీసు శాఖ అధికారుల దృష్టిలో ఎలాంటి రిమార్క్ లేకుండా విధులు నిర్వర్తించిన వారిని గుర్తించి పదోన్నతులు కల్పించామని వివరించారు. హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతులు పొందిన వారిలో ప్రతాప్, ఇస్మాయిల్, పండరి, సుభాష్, రవి, రఫిక్ ఉన్నారు.

Advertisement

Next Story