- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడి అనుమానాస్పద మృతి.. హత్య అని అనుమానం..
దిశ, పెగడపల్లి : మండలంలోని నామాపూర్ గ్రామానికి చెందిన చిర్ర సంతోష్(24) అనుమానాస్పద స్థితిలో మరణించాడు. వివరాల్లోకి వెళితే.. సంతోష్ జగిత్యాలలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేస్తూ ఉండేవాడు. ఎప్పటిలానే ఈ నెల 7న డ్యూటీకి వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఇంటికి రాలేదు. ఒక్కోసారి పని ఎక్కువ ఉన్న రోజు హాస్పిటల్‌లోనే ఉండేవాడు. అలానే ఆ రోజు కూడా ఉండి ఉంటాడని తల్లీదండ్రులు అనుకున్నారు. అయితే ఈ రోజు ఉదయం రామగుండం రైల్వే పోలీస్‌ల నుండి పెగడపల్లి ఎస్ఐకి రైల్వే ట్రాక్ పక్కన యువకుడి మృతదేహం ఉందని సమాచారం అందించారు.
వారు చెప్పిన వివరాల ప్రకారం చిర్ర సంతోష్ వారి తల్లీదండ్రులకు సమాచారం అందించారు. దీనితో వారు గ్రామ సర్పంచ్‌కి విషయం తెలుపగా సర్పంచ్, ఎస్ఐతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహం మల్యాల రైల్వే స్టేషన్ దగ్గర ట్రాక్ మీద పడి ఉందని చెప్పడంతో హుటాహుటిన వెళ్లి చూశారు. అది తమ కొడుకే అని చిర్ర నర్సయ్య గుర్తు పట్టి బోరున విలపించాడు. అయితే ట్రాక్ మీద పడి ఉన్న తమ కొడుకు మృతదేహం తీరు చూసి ఎవరో హత్య చేసి ఇక్కడకు తీసుకొచ్చి పడేసినట్లుగా ఉందని మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. తమ కుమారుడి చావు మీద విచారణ జరిపించాలని కోరారు. ఈ కేసును మల్యాల పోలీస్ స్టేషన్ కి బదిలీ చేయమని రామగుడం రైల్వే పోలీస్ అధికారులకు ఒక లేఖ రాశారు.