- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
10 సెకన్ల టిక్ టాక్ ట్రై చేస్తే.. ప్లాస్టిక్ సర్జరీ చేయాల్సి వచ్చింది!
దిశ, ఫీచర్స్ : టిక్ టాక్ ట్రెండ్ ఓ పదేళ్ల చిన్నారిని కష్టాల్లోకి నెట్టింది. చేతులకు గాయాలై కోలుకునేందుకు రెండేళ్లు పట్టేలా చేసింది. ప్రస్తుతం యూకేలో ఎండలు మండుతుండగా.. కేవలం డియోడరెంట్‌తో ఐస్ కోల్డ్ ఫీలింగ్ పొందడమే ఈ సోషల్ మీడియా ట్రెండ్ కాగా ఇద్దరు పిల్లలు దీన్ని ట్రై చేద్దామని డిసైడ్ అయ్యారు. ముందుగా ఓ చిన్నారి రెండు సెకన్ల పాటు డియోడరెంట్ స్ప్రే చేయడంతో చల్లని ఫీలింగ్ కలిగిందని చెప్పడంతో.. సెకండ్ చైల్డ్ 10 సెకన్ల పాటు ఈ ట్రెండ్‌ను ట్రై చేసింది. కానీ అనుకోకుండా చేతులు ఎరుపెక్కడం, వాపు రావడం మొదలైంది. ఇది గమనించిన తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పరీక్షించిన వైద్యులు స్కిన్ పూర్తిగా డ్యామేజ్ అయిందని ప్లాస్టిక్ సర్జరీ చేశారు. నార్మల్ స్టేజ్‌కు వచ్చేందుకు మినిమమ్ రెండేళ్లు పడుతుందని స్పష్టం చేశారు. దీంతో ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అసలు ఎవరి జోలికి పోని తన బిడ్డకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంపై బాధపడింది. ఇలాంటి సోషల్ మీడియా ట్రెండ్స్ పిల్లల ప్రాణాల మీదకు వస్తున్నాయని, ఇలాంటివి బ్యాన్ చేయాలని కోరింది.