- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ సెకండ్ లిస్ట్‌కు ముహూర్తం ఖరారు.. టీజేఎస్, కామ్రేడ్ల కోసం జాబితా హోల్డ్!
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్టు ఈ నెల 21న విడుదలయ్యే అవకాశం ఉన్నది. అన్ని సెగ్మెంట్లలో ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ టీజేఎస్, కామ్రెడ్ల సీట్ల కోసం జాబితాను హోల్డ్‌లో పెట్టినట్లు ఏఐసీసీ లీడర్ ఒకరు తెలిపారు. రెండు రోజుల్లో ఆ రెండు పార్టీలతో ఒప్పందాలు పూర్తవుతాయని, ఆ వెంటనే టికెట్లు ప్రకటిస్తారని వెల్లడించారు. అయితే ఆ లిస్టులో ఎవరి పేర్లు ఉండబోతున్నాయి? సీనియర్లకు ఆశించిన సీట్లు లభిస్తాయా? బీసీలకు న్యాయం జరుగుతుందా? అనే ఉత్కంఠ నెలకొన్నది. ఒకవేళ రెండు రోజుల్లో టీజేఎస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీ అలయెన్స్ తేలకపోతే దసరా తర్వాతే రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్‌కు బిగ్ టాస్క్
కాంగ్రెస్ అసంతృప్తులను బుజ్జగించడమే పార్టీకి టాస్క్‌గా మారింది. ఫస్ట్ లిస్టు తర్వాత అసంతృప్త జ్వలలు రగులుతూనే ఉన్నాయి. కొందరు ఏకంగా పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌కు వెళ్లి మరీ ధర్నాలు చేయడం, ఫ్లెక్సీలు చింపడం వంటివి చేశారు. సోమశేఖర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి లీడర్లు ప్రెస్ మీట్లు నిర్వహించి పార్టీ, రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేయగా మేడ్చల్ టికెట్ ఆశించి భంగపడ్డ హరివర్ధన్ రెడ్డి సైతం తన అసంతృప్తిని సోషల్ మీడియా సాక్షిగా వెలిబుచ్చారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు కొందరు ఆశావహులకు జానారెడ్డి టీమ్ ముందుగానే సర్ధి చెప్పినా ఆయా నేతలు పార్టీపై విమర్శలు చేయడం గమనార్హం. మరోవైపు రెండో లిస్టు తర్వాత ఎక్కువ మంది అసంతృప్త నేతలు బయటపడే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయా లీడర్లను సర్దుబాటు చేయడం జానారెడ్డి టీమ్‌కు, పార్టీకి పెద్ద టాస్క్ అని పొలిటికల్ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా పెండింగ్‌లోని సెగ్మెంట్లలో ఎక్కువ కాంపిటీషన్ ఉండటంతో పాటు ఆయా సెగ్మెంట్లను సీనియర్లు ఆశిస్తున్నారు. దీంతో టికెట్ రాని నేతలను ఎలా కన్విన్స్ చేయాలని జానారెడ్డి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.
మధుయాష్కీ ఇంట్లో భేటీ
ఫస్ట్ లిస్టులో బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చిన పార్టీ రెండో జాబితాలో ఆ వర్గాల లీడర్లు ఆశించిన సీట్లు ఇస్తుందా? అని బీసీ నేతలు మదన పడుతున్నారు. పైగా బీసీ నేతల్లో కీలకంగా ఉన్న మధు యాష్కీ గౌడ్, మహేశ్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ వంటి తదితర నేతల టికెట్లు సైతం ఇంకా ప్రకటించలేదు. వారికి పార్టీ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. దీంతో మాజీ ఎంపీలు రాజయ్య, బలరాం, షెట్కార్‌లు సోమవారం మధు యాష్కీ ఇంట్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. బీసీల సీట్లు, ఫస్ట్ లిస్టులో సీనియర్లకు ప్రయారిటీ ఇవ్వకపోవడం వంటి అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ప్యారచూట్ నేతలకు ఇచ్చిన ప్రాధాన్యం తమకు ఇవ్వట్లేదని ఓ మాజీ ఎంపీ మధుయాష్కీ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.