- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో అసలైన గేమ్ స్టార్ట్.. కేసీఆర్‌కు మరో షాక్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయ క్షేత్రంలో అసలైన గేమ్ మొదలైంది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహారం సాగుతోంది. ఈ క్రమంలో తమ డిమాండ్ల పరిష్కారం కోసం వివిధ వర్గాల నుంచి సీఎం కేసీఆర్ పై ఒత్తిడి పెరుగుతోంది. తాజాగా జగిత్యాల జిల్లా చెరుకు రైతులు గులాబీ బాస్ కు అల్టిమేటం జారీ చేశారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో సమావేశమైన చెరుకు రైతులు రేపు కోరుట్లలో జరగబోయే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ రీ ఓపెన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోరుట్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తామని రైతులు హెచ్చరించారు.
రెండు సార్లు మాట ఇచ్చి తప్పారు:
గతంలో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన సీఎం కూతురు కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని మాయ మాటలు చెప్పి ఇప్పటి వరకు తెరిపించలేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు దఫాలుగా జరిగింది ఏదో జరిగిపోయినా మూడోసారి ఓట్ల కోసం వస్తున్న కేసీఆర్ చేత స్థానిక నేతలు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం విషయంలో స్పష్టమైన హామీ ఇప్పించాలని డిమాండ్ చేశారు. మిగతా పార్టీలు చక్కెర ఫ్యాక్టరీ రీ ఓపెన్ చేయించేందుకు హామీ ఇస్తుంటే బీఆర్ఎస్ కు మాత్రం ఎందుకు సాధ్యం కావడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో రేపటి సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
Read more : కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌కు BIG షాక్