CWC కొత్త చరిత్రను లిఖిస్తుంది: సోనియాగాంధీ

by GSrikanth |   ( Updated:2023-09-16 10:02:17.0  )
CWC కొత్త చరిత్రను లిఖిస్తుంది: సోనియాగాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం తెలంగాణలో మాత్రమే కాక మొత్తం దేశానికే వర్తించేలా అభివృద్ధి, ప్రజలందరి ఆత్మగౌరవ విధానాలకు కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు. ఈ దిశగానే సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొత్తగా సీడబ్ల్యూరీ ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సమావేశానికి హైదరాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీ ఆ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల నిమిత్తం వచ్చారు.

Advertisement

Next Story