బండి సంజయ్ తొలగింపు అన్యాయం.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్

by GSrikanth |   ( Updated:2023-10-26 11:59:13.0  )
బండి సంజయ్ తొలగింపు అన్యాయం.. సీపీఐ నారాయణ షాకింగ్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ని అన్యాయంగా రాష్ట్ర అధ్యక్ష్య పదవి నుంచి తప్పించారని, సొంత పార్టీ నాయకుల కంటే బీజేపీ పెద్దలకు బీఆర్ఎస్ నేతలే ఎక్కువైపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎన్నికల వేల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కరీంనగర్‌లో కేబుల్ బ్రిడ్జిని సీపీఐ నేతలు పరిశీలించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీతో గట్టిగా కొట్లాడుతున్నాడనే బండిని తొలగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పరోక్షంగా సహకరిస్తోందని అనడానికి బండిని తప్పించడమే నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీలను ఓడించేందుకు పనిచేస్తామని అన్నారు.

ప్రకృతి అందాలను మరింత పెంచుతామని కరీంనగర్ కేబుల్ బ్రిడ్జిని నిర్మించారని, కానీ నిజానికి కమీషన్ల కోసమే నిర్మించారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందినవారే కాంట్రాక్ట్ దక్కించుకుని ఏమాత్రం నాణ్యత పాటించకుండానే ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారని మండిపడ్డారు. హడావుడిగా కేబుల్ బ్రిడ్జి పనులు చేపట్టారని, దీని నాణ్యతపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. దీని పరిస్థితి చూస్తుంటే రేపో మాపో కూలిపోయేలా ఉందన్నారు. తెలంగాణలో నిర్మించిన బ్రిడ్జ్‌లు ఎలా కూలిపోతున్నాయో బీఆర్ఎస్ ‌ప్రభుత్వం కూలిపోతుందని విమర్శించారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించామని గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు బయటపడ్డాయని, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై జ్యూడిషల్ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed