కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో కనిపించని కీలక నేతల పేర్లు.. రియాక్షన్ ఇదే!

by GSrikanth |   ( Updated:2023-09-25 04:46:06.0  )
కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో కనిపించని కీలక నేతల పేర్లు.. రియాక్షన్ ఇదే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌లో రెడ్డి వర్సెస్ బీసీ పంచాయితీ స్టార్ట్ అయ్యింది. ఇంటర్నల్‌గా లీక్ అయిన ఫస్ట్ లిస్టులో బీసీ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ పేర్లు లేవనే చర్చ మొదలైంది. ఫస్ట్ లిస్టులో ఎస్సీ, ఎస్టీ బీసీల పేర్లే ఫస్ట్ లిస్టులో ఉంటాయని గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారని, కానీ ఇప్పుడు వారి పేర్లు లేక పోవడం బీసీ నేతల్లో ఆగ్రహానికి కారణమైంది. కొంత మంది రెడ్డి నేతల జోక్యంతోనే బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆ సామాజిక వర్గానికి చెందిన లీడర్లు ఆరోపిస్తున్నారు. గ్రౌండ్ లెవల్ నుంచి పార్టీని కాపాడుతున్న తమపై వివక్ష చూపితే కాంగ్రెస్‌కే నష్టమనే ఇండికేషన్‌ను బీసీ నేతలు వినిపిస్తున్నారు.

సర్వేలంటూ దాటవేత?

బీసీ నేతల టిక్కెట్ల అంశంలో సర్వేలు ఇంకా పూర్తి కాలేదని.. అందుకే ఫస్ట్ లిస్టులో పేర్లు లేవని పార్టీకి చెందిన కీలక నేతలు సదరు లీడర్లకు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నా.. ఊహించని విధంగా తమకు షాక్‌లు ఇస్తున్నారని ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఒకే అసెంబ్లీ సెగ్మెంట్‌లో బీసీలకు, రెడ్డి అభ్యర్థులకు సర్వేలు చేయడం వల్ల మొదటి నుంచీ ఆర్థికంగా బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికే సర్వే అనుకూలంగా ఉంటుందని బీసీ నేతలు చెబుతున్నారు. అలాంటప్పుడు కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ తేడా ఏముంటుందని బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై తాడో పేడో తేల్చుకునేందుకు బీసీ మంత్రం పేరిట సదరు లీడర్లు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయడం గమనార్హం.

రివర్స్ పంచ్ ఇవ్వాల్సిందే?

గత ఎన్నికల్లో బీసీ నేతలు ఓడిపోయేందుకు పార్టీలోని కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లీడర్లు బ్యాక్ గ్రౌండ్‌గా సహకరించారని, ఇదంతా తెలిసినా.. పార్టీ అధినాయకత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విచిత్రమని బీసీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి బీసీలకు ఆశించిన స్థాయిలో టిక్కెట్లు ఇచ్చి సహకరించకపోతే.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలను ఓడించేందుకు తాము వెనుకాడబోమంటూ బీసీ నేతలు అంతర్గతంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా బీసీలకు అధిక టిక్కెట్లు ఇవ్వాలని గతంలో చెప్పినా.. రాష్ట్ర పార్టీకి చెందిన కొందరు నేతలు అడ్డుపడటం సరికాదని వారు సీరియస్ అవుతున్నారు.

More News : టికెట్ల కేటాయింపు వేళ భట్టి విక్రమార్కతో కీలక నేతల భేటీ

TS: రాష్ట్రంలో కాంగ్రెస్‌ గ్రాఫ్ పెరడగానికి అసలు కారణం ఇవే!

Advertisement

Next Story

Most Viewed