కాంగ్రెస్ కార్యకర్తలు పులులు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-10-31 15:36:40.0  )
కాంగ్రెస్ కార్యకర్తలు పులులు.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఉమ్మడి మహమూబ్ నగర్‌లోని కొల్లాపూర్‌‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభకు అగ్రనేత రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ యుద్ధం బీఆర్ఎస్‌కు, కాంగ్రెస్‌కు మధ్యనే ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్.. ఈ మూడూ ఒకే కూటమిగా కలిసి పనిచేస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో బీజేపీకి కేసీఆర్ సంపూర్ణ మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు. జీఎస్టీ, సాగు చట్టాలకు పూర్తిగా సహకరించారని అన్నారు. ప్రతిపక్షాలపై సీబీఐ, ఈడీ, సీబీఐ లాంటి కేసులు ఉన్నాయి.

సోదాలు జరుగుతున్నాయి. కానీ, కేసీఆర్ మీద ఈడీ, సీబీఐ, విజిలెన్స్, ఐటీ లాంటివేవీ లేవు. కేసుల్లేవ్.. సోదాల్లేవ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలవకూడదనే లక్ష్యంతోనే బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయని అన్నారు. ఇంకోవైపు మజ్లిస్ కూడా లోపాయకారీగా సహకరిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ ఎక్కడ కోరుకుంటే అక్కడ మజ్లిస్ ఎంట్రీ ఇస్తుందని విమర్శించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి సహకరించేలా.. కాంగ్రెస్‌ను డ్యామేజ్ చేసేలా మజ్లిస్ బరిలోకి దిగుతున్నదని మండిపడ్డారు. మజ్లిస్‌, బీజేపీకి ఓటు వేసినా అది చివరకు బీఆర్ఎస్‌కే లాభం జరుగుతుందని చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కొట్లాడుతున్నది. జాతీయ స్థాయిలో బీజేపీతో కొట్లాడుతున్నది కాంగ్రెస్సే అని అన్నారు.

ఇక్కడ బీఆర్ఎస్‌ను ఓడించడం ఎంత ఖాయమో.. కేంద్రంలో బీజేపీని రానివ్వకుండా ఆపే సామర్థ్యం కాంగ్రెస్‌దే అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మనసులో ఇప్పటికే స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు, మీడియా.. అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెస్‌వైపు ఉన్నారు. అదే కాంగ్రెస్ బలమని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులు పులులు.. ధైర్యం కలిగినవారు.. భయపడేవారు కాదు.. అధికార పార్టీ భయపెట్టే ప్రయత్నం చేస్తుంది.. కుట్ర చేస్తుంది.. కానీ బబ్బర్ షేర్‌లు.. కాంగ్రెస్ బిడ్డలు.. మీ సమయం రాబోతున్నది. ఆలస్యమేమీ లేదు.. ప్రభుత్వం రాబోతున్నది. తెలంగాణ ప్రజలు, పార్టీ కార్యకర్తలు కలిసి ప్రజల తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.

Read More..

తెలంగాణ ప్రజలు నా కుటుంబ సభ్యులు: రాహుల్ గాంధీ

Advertisement

Next Story

Most Viewed