- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరోజు పార్లమెంట్‌కు అందుకే లేట్‌గా వెళ్లాను: MP కోమటిరెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవడం బెటర్ అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్వయంగా మహిళా రిజర్వేషన్‌కు మద్దతిస్తున్నామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లోక్ సభలోనే చెప్పారని గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మా బిల్లు అంటూ సోనియా గాంధీ ప్రకటన కూడా చేశారని వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయ్యేటప్పుడు 66 మంది బీజేపీ ఎంపీలు కూడా లేరని, అది మాట్లాడకుండా కాంగ్రెస్‌పై బురద జల్లే ప్రయత్నం చేయొద్దని సూచించారు. కేవలం ఎన్నికల కోసమే మహిళా రిజర్వేషన్ అంటూ బీజేపీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయని వ్యక్తి కిషన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సమావేశాలకు వస్తున్న సమయంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయామని అందుకే మహిళా బిల్లు సమయంలో లేమని ఎంపీ క్లారిటీ ఇచ్చారు.