- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దమ్మున్న నాయకులతోనే ఇది సాధ్యం.. గాంధీ జయంతి రోజున కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: గాంధీ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మురుగు వ్యర్థాల రవాణా వాహనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గాంధీజీ ఆలోచనలతో పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. దేశంలో ఎవరూ చెప్పని విధంగా ‘సఫాయి అన్న నీకు సలాం’ అని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. గాంధీ జయంతి సందర్భంగా 162 సిల్ట్ కార్టింగ్ వాహనాలను అందించడం సంతోషంగా ఉందన్నారు. గాంధీని ఆదర్శంగా తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలిస్తున్నారని చెప్పారు.
శాంతియుత పోరాటం చేసి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. గాంధీ ఫొటోలు పెట్టుకుని ఢిల్లీలో కొందరు నినాదాలు ఇస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో గాంధీజీ ఫొటోలకు పోజులు ఇవ్వడం తప్ప.. ఆచరించరని విమర్శించారు. ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు అందజేస్తున్నామని, దళితుల ఉద్ధరణ కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. దమ్మున్న నాయకులతోనే ఇది సాధ్యమవుతుందన్నారు.