సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన గ్రామంలోనే పుట్టా.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు

by GSrikanth |   ( Updated:2023-08-18 06:08:21.0  )
సర్దార్ సర్వాయి పాపన్న పుట్టిన గ్రామంలోనే పుట్టా.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ నేతలు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ చిత్ర పటానికి కీలక నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాచరికాన్ని ఎదురించి ప్రజల కోసం పోరాడిన గొప్ప వీరుడు పాపన్న గౌడ్ అని కొనియాడారు. ప్రజలకు స్వేచ్ఛ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి పాపన్న అని చెప్పుకొచ్చారు. సర్ధార్ సర్వాయి పాపన్న పుట్టిన గ్రామంలోనే పుట్టానని.. సర్ధార్ సర్వాయి పాపన్న జీవితం తనకు స్ఫూర్తిదాయకమన్నారు. లండన్‌లో ఉన్న చిత్రపటం ఆధారంగా మొదటి విగ్రహం చేయించినట్లు పొన్నాల లక్ష్మయ్య వెల్లడించారు.

రాబోయే ఎన్నికల్లో పార్టీలో బలహీన వర్గాల ప్రజలకు అసంతృప్తి లేకుండా చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ పూర్‌ డిక్లరేషన్‌కు అనుగుణంగా బలహీన వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అన్ని కులలాల వారిని కలుపుకుని గోల్కొండ కోటను ఆక్రమించిన వ్యక్తి సర్వాయి పాపన్న అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు పార్టీ రక్షణ కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్‌తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు.

Read More : తిరుగుబాటుకు ప్రతిరూపం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్

Advertisement

Next Story

Most Viewed