బీజేపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు: Etela Rajender

by GSrikanth |   ( Updated:2023-08-26 15:09:46.0  )
బీజేపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు: Etela Rajender
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ చేరికల కమిటీ చైర్మన్, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు. ఆదివారం ఖమ్మంలో నిర్వహించబోయే అమిత్ షా బహిరంగ సభలో చాలామంది పార్టీలో చేరబోతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీని నేరుగా ఎదుర్కోలేక బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్నదే బీజేపీ పార్టీ లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో రైతులకు సంకెళ్లు వేసిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. రైతుల సమస్యలపై ఖమ్మం సభలో ప్రకటన చేయబోతున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed