- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘70 స్థానాల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుంది’
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక నేతలకు తెలంగాణలో ఏం పని అని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. కర్ణాటక నేతలు గద్దల్లాగా వచ్చి పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేలు మాకు ఉన్నాయని, బీఆర్ఎస్ పార్టీ 70 సీట్లకి పైగా గెలుపొంది మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పెయిడ్ ఎగ్జిట్ పోల్స్‌తో కాంగ్రెస్ శాడిస్ట్ ఆనందం పొందుతోందని, రేవంత్ కాంగ్రెస్ లేకితనానికి పరాకాష్టగా మారిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు లేఖి తనం చూపిస్తూ, చిల్లర ప్రచారం చేస్తున్నారన్నారని విమర్శించారు. అధికారం లేకుండానే ఇంత లేఖి తనమా అని ప్రశ్నించారు. సంప్రదాయాలు తెలియకుండా కేబినెట్ మీటింగ్ గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవుటాఫ్ టర్మ్‌లో కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం ఆరువేల కోట్ల రూపాయిలు బిల్లులు ఇప్పించారని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడం వారి చిల్లర.. లేకితనానికి పరాకాష్ట అన్నారు.
రేవంత్ రెడ్డి అంటే దద్దమ్మ అని, ప్రజాస్వామ్య పద్దతులు, ప్రోటోకాల్ తెలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు ఇలాంటి చిల్లర లేఖపై ఎలా సంతకం పెట్టారని, ఇది ముమ్మాటికీ బ్యూరోక్రసిని, ఈసీని అవమానించడమేనన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియాలో చేస్తున్న లేఖి ప్రచారాన్ని తెలంగాణ సమాజం గమనించాలని విజ్ఞప్తి చేశారు. కర్నాటక గద్దలు, ఏపీ నుంచి పచ్చపార్టీ గద్దలు, ఢిల్లీ గద్దలు తెలంగాణని కమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భావన నియంత్రణకు గురిచేసి తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని, మనమంతా జాగ్రత్తగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఓట్ల లెక్కింపు పూర్తికాకుండా, తీర్పు రాకుండానే రేవంత్ కాంగ్రెస్ చాలా లేకిగా వ్యవహరిస్తుందని, కేసీఆర్ ప్రగతి భవన్ ఖాళీ చేస్తున్నారని, రేవంత్ ఇంటి వద్ద భద్రత పెరిగిందని, కొత్తగా సున్నాలు వేస్తున్నారని సోషల్ మీడియాలో చిల్లర ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు.