మాంచి జోష్ మీదున్న కాంగ్రెస్‌కు BIG షాక్.. నేడు పార్టీకి కీలక నేతలు రాజీనామా

by GSrikanth |   ( Updated:2023-10-20 04:28:37.0  )
మాంచి జోష్ మీదున్న కాంగ్రెస్‌కు BIG షాక్.. నేడు పార్టీకి కీలక నేతలు రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస చేరికలతో మాంచి జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనూహ్య షాక్ తగిలింది. ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు కంచుకోట అయిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలక నేత పార్టీకి రాజీనామా చేయనున్నారు. యువజన సంఘాల నేత, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేత జిట్టా బాలకృష్ణారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.


శుక్రవారం తెలంగాణ భవన్‌లో భారీ అనుచరగణంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. గురువారమే హైదరాబాద్‌లో మంత్రులతో జిట్టా బాలకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. కాగా, తెలంగాణ ఉద్యమంలో జిట్టా చురుకుగా పాల్గొన్నారు. 2009 వరకు అప్పటి టీఆర్‌ఎస్‌ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన వివిధ సమీకరణాల నేపథ్యంలో పలు పార్టీలు మారుతూ వచ్చారు. జిట్టాతో పాటు తెలంగాణ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి కూడా నేడు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

Read More..

బీఆర్ఎస్‌లోకి నేడు మరో ఇద్దరు.. కండువా కప్పనున్న సీఎం కేసీఆర్

కాంగ్రెస్ గ్రాఫ్‌పై కేసీఆర్ ఆందోళన.. క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఫ్లాష్ సర్వేలు

Advertisement

Next Story