సీఎం కేసీఆర్ అవినీతి, ఆస్తులపై వీడియో ప్రదర్శన

by GSrikanth |
సీఎం కేసీఆర్ అవినీతి, ఆస్తులపై వీడియో ప్రదర్శన
X

దిశ, డైనమిక్ బ్యూరో: సారు.. కారు.. మళ్ళీ రారు.. అని ఏఐసీసీ మీడియా పరిశీలకులు డాక్డర్ అజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించారు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అవినీతి, ఆస్తులపై వీడియో ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము గాంధీభవన్‌లో కారు తెచ్చి పెడితే పోలీసులు దాన్ని లేకుండా చేశారని, పోలీసులు కూడా కారును లేకుండా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వైద్యం విషయంలో చాలా దారుణంగా ఉందన్నారు. 57% మంది మహిళలు పోషకాహార లోపంతో ఉన్నారని వెల్లడించారు.

గర్భిణీ మహిళలకు సరైన రక్తం దొరకడం లేదని, అధిక శాతం ప్రజలకు న్యూట్రీషన్ ఫుడ్ దొరకడం లేదని ఆరోపించారు. హెల్త్ మౌలిక సదుపాయాల విషయంలో దేశంలో తెలంగాణ 14వ స్థానంలో ఉందని వెల్లడించారు. హెల్త్ శాఖలో జరిగిన పనులకు బిల్లులు కూడా రావడం లేదని, దేశంలో ప్రైవేట్ వైద్యం తెలంగాణలో ఎక్కువ జరుగుతుందని, 78 శాతం ప్రజలు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారని, 70 శాతం పిల్లలకు వైద్యం విషయంలో నిర్లక్ష్యం జరుగుతుందని ఆరోపించారు.

తెలంగాణలో పదేళ్ల నుంచి వైద్య, ఆరోగ్యం విషయంలో కేసీఆర్ చాలా నిర్లక్ష్యం చేశారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి ధ్వజమెత్తారు. 2014, 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదని అన్నారు. తెలంగాణలో నిర్బంధం కొనసాగుతుంది. హెల్త్, ఫామిలీ వెళ్ఫెర్ లలో 12, 735 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలిపారు. డాక్టర్ పోస్టులు 2,659 ఖాళీలు ఉన్నాయని, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు 1,183 ఖాళీలు ఉన్నాయని, ఇలా ఉంటే వైద్య విద్య ఎలా సాగుతుందని మండిపడ్డారు. నర్సింగ్ హాస్పిటల్ లో డాక్టర్ 3,823 పోస్టులు, ఖాళీలు, 1100 నర్సింగ్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed