- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మిగిలిన 19 సెగ్మెంట్లలో టఫ్ కాంపిటీషన్.. రంగంలోకి సోనియా గాంధీ!
దిశ, తెలంగాణ బ్యూరో: ఫస్ట్ లిస్టులో 55, సెకండ్ లిస్టులో 45 సెగ్మెంట్ల అభ్యర్థుల లిస్టును రిలీజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన 19 నియోజకవర్గాల అభ్యర్థులను థర్డ్ లిస్టులో ప్రకటించనున్నది. ఈ సెగ్మెంట్లలో అభ్యర్థులను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఎంపిక చేసినప్పటికీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిర్ణయించనున్నారని పార్టీలోని ఓ వ్యక్తి తెలిపారు. కమ్యూనిస్టుల పొత్తులతో పాటు మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్ లలో టఫ్కాంపిటేషన్ నెలకొన్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు రెండేసి సెగ్మెంట్లు ఇవ్వనున్నారు. వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు నియోజకవర్గాలను కేటాయించనున్నారు.
ప్రకటించని 19 సెగ్మెంట్లు
వైరా, కొత్తగూడెం, మిర్యాలగూడ, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పఠాన్ చెరువు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణ్ ఖేడ్, అశ్వారావుపేట.
కారణాలు ఇవేనా?
ఇప్పటివరకు చార్మినార్ నియోజకవర్గంలో మస్కట్ ఐస్ క్రీమ్ అధినేత అలీఖాన్‌కు టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. అయితే ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆ పార్టీలో టిక్కెట్ రావడం లేదని ప్రచారం ఇంటర్నల్‌గా జరుగుతున్నట్లు కాంగ్రెస్ గుర్తించింది. దీంతో ఎంఐఎం టిక్కెట్ ఇవ్వని పక్షంలో సదరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు కండువా కప్పి టిక్కెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. అంతేగాక పాతబస్తీలోని అన్ని సెగ్మెంట్లకు ఆయన ను ఇన్‌చార్జిగా ప్రకటించే అవకాశం ఉన్నది. దీంతోనే చార్మినార్‌ను హోల్డ్‌లో పెట్టినట్టు తెలిసింది. మరోవైపు నిజామాబాద్ అర్బన్‌లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ధర్మపూరి సంజయ్ టికెట్ రేసులో ఉండగా షబ్బీర్ అలీని అక్కడ్నుంచి పోటీలో ఉంచాలని పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కొడంగల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీలో ఉంచాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన. దీంతో షబ్బీర్‌కు స్థానం మార్చనున్నారు.
మరోవైపు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి పోటీ పడుతున్నప్పటికీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని బరిలో దించాలని పార్టీ భావిస్తున్నది. ఇక సూర్యాపేట్‌లో దామోదర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డిల మధ్య టిక్కెట్ పోటీ నెలకొన్నది. ఇద్దరూ బలమైన నేతలు కావడంతో సోనియా నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నారు. దామోదర్ రెడ్డికి అసెంబ్లీ కేటాయించి, నల్లగొండ ఎంపీ స్థానం నుంచి పటేల్ రమేశ్ రెడ్డిని నిలపెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నది. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్‌తో పాటు పిడమర్తి రవి, వడ్డేపల్లి రవి, మందుల సామేల్ మధ్య పోటీ నెలకొన్నది. కానీ, తాజాగా మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్‌లో చేరారు. ఇక బాన్సువాడలో కాసుల బాలరాజు, డాక్టర్ అజయ్ కుమార్‌లు పోటీ పడుతున్నారు. జుక్కల్‌లోనూ ఇద్దరు బలమైన నేతల మధ్య పోటీ ఉన్నది.
పటాన్ చెరువులో నీలం మధుకు టికెట్ ఫైనల్ చేయనున్నారు. ఇల్లందులో కోరం కనకయ్య, చీమల వెంకటేశ్వర్లుతో పాటు మరో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు. డోర్నకల్ రాంచంద్రునాయక్, మాలోతు నెహ్రూనాయక్, భూపాల్‌నాయక్‌లు పోటీ పడుతున్నారు. సత్తుపల్లిలో మాజీ మంత్రి సంబానీ చంద్రశేఖర్, మట్ట రాగమయి దయానంద్, సుధాకర్ రెడ్డి, మానవతా రాయ్‌లు పోటీ పడుతున్నారు. అశ్వారావుపేటలో జారే ఆదినారాయణ, తాటి వెంకటేశ్వర్లు, వగ్గెల పూజిత, సున్నం నాగమణి పోటీ పడుతున్నారు. నారాయణ ఖేడ్‌లో సురేశ్ షెట్కార్, పట్లోళ్ల సంజీవ్ రెడ్డి మధ్య పోటీ ఉన్నది. కరీంనగర్‌లో కొనగళ్ల మహేశ్, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ఎంఎస్ రోహిత్ రావు, శ్రీనివాస్, రమ్యారావు లు టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో అభ్యర్థుల ఎంపికను సోనియా గాంధీ నిర్ణయించనున్నారు. దీంతో పాటు టికెట్ రాని వాళ్లను బుజ్జగించే బాధ్యతను కూడా ఏఐసీసీ తీసుకోనున్నది.
ఇటీవల పార్టీలో చేరిన వారికి కేటాయించిన స్థానాలు..
ఆదిలాబాద్ - కంది శ్రీనివాస్ రెడ్డి
ఆసిఫాబాద్ - శ్యామ్ నాయక్
ముతోల్ - నారాయణ పటేల్
కూకట్ పల్లి - బండి రమేష్
శేరిలింగంపల్లి - జగదీష్ గౌడ్
తాండూరు - మనోహర్ రెడ్డి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ - వెన్నెల
మహబూబ్ నగర్ - ఎన్నం శ్రీనివాస్ రెడ్డి
మునుగోడు - రాజ్ గోపాల్ రెడ్డి
పాలకుర్తి - యశశ్విని
పరకాల - రేవూరి ప్రకాష్ రెడ్డి
వర్ధన్నపేట - నాగరాజు
ఖమ్మం - తుమ్మల నాగేశ్వర్ రావు
పాలేరు - పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పినపాక - పాయం వెంకటేశ్వర్లు
భువనగిరి - కుంభం అనిల్ కుమార్ రెడ్డి