- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TS: పోలింగ్ అధికారుల మెనూ ఖరారు.. డిన్నర్‌లో చికెన్ కర్రీ
దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారులకు ఎన్నికల సంఘం మెనూ ఖరారు చేసింది. నవంబర్ 29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్, 30న పోలింగ్ సెంటర్ వద్ద వారికి అందించబోయే భోజన పదార్థాల వివరాలను వెల్లడించింది. బ్రేక్ ఫాస్ట్, లంచ్, టీ, స్నాక్స్ డిన్నర్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలీంగ్ స్టేషన్ కింద 15 మంది విధులు నిర్వర్తించనుండగా రెండు రోజులకు కలిపి ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలోకి వచ్చే అధికారుల భోజన ఖర్చుల కింద రూ3,800 ఖర్చు చేయబోతోంది.
29న డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉదయం బ్రేక్ ఫాస్ట్ కింద గోధుమ రవ్వతో కిచిడి, పల్లీల చట్నీ, టమాటా చట్నీ, టీ ఇవ్వనున్నారు. మధ్యాహ్నం లంచ్ లో రైస్, వెజ్ కర్రీ, ఎగ్ పులుసు, సాంబార్/రసం, పెరుగు, పాపడ్, చట్నీ ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం స్నాక్స్ లో భాగంగా వాటర్, టీ, బిస్కెట్ ఇవ్వనున్నారు. రాత్రి డిన్నర్ కోసం చపాతీ, రైస్, వెజ్ కర్రీ (స్థానిక లభ్యత ప్రకారం), పప్పు, పెరుగు, డ్రింకింగ్ వాటర్ ఇవ్వనున్నారు.
పోలింగ్ రోజు చికెన్ కర్రీ:
పోలింగ్ రోజు నవంబర్ 30న ఉదయం 6 నుంచి 6:30 గంటల మధ్య టీ, బిస్కెట్. ఉదయం 8:30 నుంచి 9 వరకు బ్రేక్ ఫాస్ట్ టైమ్ కేటాయించారు. ఇందులో ఉప్మా(గోధుమ రవ్వ), టమాటా చట్నీ/పల్లీల చట్నీ. లంచ్ టైమ్ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు. ఇందులో రైస్, చపాతి, వెజ్ కర్రీ, పప్పు, సాంబార్/రసం, పెరుగు, చట్నీ, బాయిల్డ్ ఎగ్ ఇవ్వనున్నారు. స్నాక్స్ లో భాగంగా టీ, బిస్కెట్ అందిస్తారు. డిన్నర్ లో భాగంగా వెజ్ పులావ్, చెపాతి, చికెన్ కర్రీ, మసాలా వంకాయ కర్రీ, పప్పు, సాంబార్, పెరుగు, పాపడ్ ఇవ్వనున్నారు.
ఒక్కో పోలింగ్ స్టేషన్ పరిధిలో 15 మంది విధులు నిర్వర్తించనున్నారు నలుగురు పోలింగ్ పర్సన్స్, 1 మైక్రో అబ్జార్వర్, 1 వెబ్ కాస్టింగ్ పర్సన్, 1 బీఎల్ఓ, 2 వాలంటీర్లు, 2 స్వీపర్/అటెండర్, 2 పోలీసులు మొత్తం 12 మంది కాగా వీరికి అదనంగా మరో ముగ్గురు రిజర్వులో ఉండనున్నారు.