హరీష్ రావు కనిపిస్తే లాగులో తొండలు విడిచి కొట్టండి.. రేవంత్ పిలుపు

by GSrikanth |
హరీష్ రావు కనిపిస్తే లాగులో తొండలు విడిచి కొట్టండి.. రేవంత్ పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అల్లుడు హరీష్ రావు నోటి దురుసు మామ కేసీఆర్ అతి తెలివి వల్ల రైతుబంధు ఆగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతుబంధు ఆగిపోవడానికి కారణమైన కేసీఆర్, హరీష్ రావులను ఈ ఎన్నికల్లో ఓడించాలన్నారు. సోమవారం డోర్నకల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రైతుబంధు ఆగిపోవడానికి కారణమైన హరీష్ రావు కనిపిస్తే లాగులో తొండలు విడిచి కొట్టాలని కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ రైతాంగానికి పిలుపునిస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అల్లుడి హరీష్ రావు నిర్వాహంపై కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుబంధు ముందుగానే వేయాలని తాము ఈసీని కోరామని కానీ ఎన్నికలకు ముందు రైతుబంధు డబ్బులు వేసి ఓట్లు దండుకోవాలని బీఆర్ఎస్ చూసిందని మండిపడ్డారు.

అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా రైతు బంధుకు ఈసీ అనుమతులు ఇచ్చినా అల్లుడి నోటిదురుసు కారణంగా రైతుబంధు ఆగిందన్నారు. రైతుబంధు ఆగిందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసం లేదని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.15 వేలు ఇస్తామన్నారు. రైతులతో పాటు రైతుకూలీలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఉచిత విద్యుత్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ దేనన్నారు. రెండు దఫాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు నిర్మించలేకపోయిందని ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed