- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూపు-1 అభ్యర్థులకు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక హామీ!
దిశ బ్యూరో, ఖమ్మం: గ్రూప్-1 పరీక్షల రద్దు నేపథ్యంలో అభ్యర్థులు అధైర్యపడకుండా ఉండాలని, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కోకన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధైర్యం చెప్పారు. శనివారం ఆయన ఓ వీడియో విడుదల చేసి అభ్యర్థులు ఆందోళన చెందకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధులు ధనదాహం కారణంగా నిరుద్యోగ యువత గోస పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా..
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ 2022లో త్వరలో 91 వేల ఉద్యోగాలు చట్ట ప్రకారం భర్తీ చేస్తామని ప్రకటించి సంవత్సరం దాటినా కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. ఎట్టకేలకు మొదటిసారి గ్రూప్-1 పరీక్షలు పెట్టగా సుమారు 3 లక్షల 80 వేల మంది అభ్యర్థులు హాజరయ్యారని తెలిపారు. వివిధ సెంటర్లలో కోచింగ్ కోసం లక్షలాది రూపాయలు వెచ్చింది పరీక్షలకు సన్నద్ధం అయితే చివరకు రాసిన తర్వాత అవి రద్ధు కావడం బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్షమే కారణమన్నారు. ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు, కొందరు మంత్రులు, కొద్దిమంది ప్రభుత్వ ఉద్యోగుల ధనదాహం, రాజకీయ స్వార్థం కారణంగా పేపర్లు లీక్ చేసి నిరుద్యోగ యువతను మోసం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టపడ్డ యువతీ, యువకులు రోడ్డన పడేవిధంగా ఈ ప్రభుత్వం చేసిందని దుయ్యబట్టారు. రెండోసారి కూడా నిబంధనలకు విరుద్ధంగా, వారి స్వార్థం కోసం పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కాగా కోసం నిరుద్యోగ యువతకు అనుమానం వచ్చి కోర్టును ఆశ్రయించగా వాటిని రద్దు చేస్తూ అద్భుతమైన తీర్పునిచ్చిందని పేర్కొందన్నారు.
గోస పడుతున్న నిరుద్యోగులు..
నాటినుంచి నేటి వరకు నిరుద్యోగుల గోస అలాగే ఉందని, మాటలతో మభ్యపెడుతూ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని విస్మరించడం, స్వలాభం కోసం నిర్వహించడం దుర్మార్గమన్నారు. ఎన్నికల అనంతరం మీ అందరి దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని, అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కోసం ఇచ్చిన అన్ని హామీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే చట్టప్రకారం 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, తప్పుల కారణంగా, డబ్బు మీద ఉన్న వ్యామోహం వల్ల నిరుద్యోగుల జీవితాలు ఆగమయ్యాయని, ప్రభుత్వం వెంటనే పరీక్షలకు సన్నద్దమైన ప్రతీ విద్యార్థికి లక్షన్నర రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు.