TS: ఆ నియోజకవర్గంలో ముగ్గురిదీ ఒకే సామాజికవర్గం!

by GSrikanth |
TS: ఆ నియోజకవర్గంలో ముగ్గురిదీ ఒకే సామాజికవర్గం!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. 20 రోజుల్లో పోలింగ్ ఉండటంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగియడంతో పూర్తి ఫోకస్ ప్రచారంపై పెట్టారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ప్రస్తుతం కరీంనగర్ నియోజకవర్గం చర్చనీయాంశమైంది. మూడు ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలను బరిలోకి దింపడం ఆసక్తిగా మారింది.

కరీంనగర్ నియోజకవర్గంలో పట్టున్న మున్నూరు కాపు సామాజికవర్గంవైపే పార్టీలన్నీ మొగ్గుచూపాయి. బీఆర్ఎస్ తరఫున గంగుల కమలాకర్, బీజేపీ నుంచి బండి సంజయ్, కాంగ్రెస్ నుంచి పురమల్ల శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. గంగుల కమలాకర్ ఇప్పటి వరకు ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచి.. ఇప్పుడు నాలుగోసారి పోటీ చేస్తున్నారు. బండి సంజయ్ గతంలో రెండుసార్లు ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోగా.. పురమల్ల శ్రీనివాస్ తొలిసారిగా అక్కడి నుంచి బరిలో దిగుతున్నారు. కరీంనగర్ నియోజకవర్గంలో 3.40 లక్షల మంది ఓటర్లు ఉండగా.. మున్నూరు కాపు, ముస్లీం ఓటర్లే కీలకం కానుంది. మరి వారు ఈసారి ఎవరికి పట్టం కడుతారో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed