‘చాలా మంది గ్రూపు-1 ఎగ్జామ్ రెండోసారి రాయలేదు’

by GSrikanth |
‘చాలా మంది గ్రూపు-1 ఎగ్జామ్ రెండోసారి రాయలేదు’
X

దిశ, వెబ్‌డెస్క్: టీఎస్‌పీఎస్‌సీపై NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో వెంకట్ మీడియాతో మీడియాతో టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై, టీఎస్‌పీఎస్‌సీపై నిరుద్యోగులు నమ్మకం కోల్పోతున్నారని తెలిపారు. మొదటిసారి గ్రూపు-1 పరీక్ష పేపర్ లీక్ కావడం చూసి.. రెండోసారి అనేకమంది పరీక్ష రాయడానికి వెనకడుగు వేశారని చెప్పారు. గ్రూపు-1 ప్రిలిమ్స్‌ను చాలా నిర్లక్ష్యంగా నిర్వహించారని అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేసి.. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed