- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగకూడదు: రాజాసింగ్
దిశ, వెబ్‌డెస్క్: సస్పెన్షన్ ఎత్తివేతపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘రెండు గంటల క్రితం మంచి వార్త విన్నాను. బీజేపీ అధిష్టానం గొప్ప మనుసుతో మంచి నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి నా వల్ల పార్టీకి ఎలాంటి నష్టం జరగకూడదు. గోషామహాల్ ఎప్పటికైనా నా అడ్డా. పార్టీ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పోటీ చేస్తా. పార్టీ అధిష్టానం తీసుకున్న ప్రతీ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఫస్ట్ లిస్ట్‌లో పేరు ఉంటుందా? లేదా? అనేది తాను తనకు కూడా తెలియదు.
అందరి లానే నేనూ వెయిట్ చేస్తున్నా. ఒకవేళ లిస్ట్‌లో పేరు ఉంటే ఏ విధంగా ప్రచారం ప్రారంభించాలి అనే దానిపై అధిష్టానం సూచనల మేరకు నడుచుకుంటా. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో డబుల్ అభివృద్ధి జరుగుతుంది. గత పదేళ్లుగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి శూన్యం. అప్పులు పెరుగుతున్నాయి. కానీ, అభివృద్ధి జరుగడం లేదు’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.