- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ MP లక్ష్మణ్ ప్రకటనను గుర్తుచేసిన కేటీఆర్.. పేపర్ క్లిప్స్ పోస్ట్!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తమతో పొత్తుకు ఎన్నో పార్టీల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. కానీ, తమ బాస్ కేసీఆర్ ఎవరితోనూ పొత్తుకు అంగీకరించలేదని గుర్తుచేశారు. విపక్షాలు మాత్రం కేసీఆర్‌ను ఓడించేందుకు ఒక్కటయ్యాయని అన్నారు. విపక్షాలు సైద్దాంతిక విభేదాలు పక్కనబెట్టి మరీ కలిసి పనిచేశాయని తెలిపారు. కేసీఆర్‌లో కలిసి పనిచేసేందుకు సిద్ధమని నాడు బీజేపీ చెప్పిందని గుర్తుచేశారు. 2018లో నాటి బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ సంకేతాలు పంపారని అన్నారు. దీనికి సంబంధించిన మీడియా క్లిప్స్ కూడా కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. నాడు ఢిల్లీ బాస్‌ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ పొత్తుకు సిద్ధమయ్యారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
బీజేపీ ప్రతిపాదనను బీఆర్ఎస్ ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తోసిపుచ్చిందని అన్నారు. 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీతో బీఆర్ఎస్ ఎందుకు కలుస్తుందని కేటీఆర్ అడిగారు. తాము పోరాటం చేసేవాళ్లమే తప్ప మోసం చేసే వాళ్లం కాదని ట్విట్టర్ వేదికగా పోస్టు పెట్టారు. అంతకుముందు ప్రధాని నిజామాబాద్ పర్యటన స్పీచ్‌పై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రధాని మోడీ ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆయనకు ఒక అలవాటు ఉంటుంది. ఎక్కడకు పోయినా పచ్చి అబద్దాలు మాట్లాడటం ప్రధాని మోడీకి అలవాటు అయ్యింది. కర్ణాటకలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ డబ్బులు ఇచ్చిందని ఆరోపణలు చేస్తారు. ఇది చిన్న పిల్లలు కూడా నమ్మని ఆరోపణలు అని కేటీఆర్ అన్నారు.