- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాకర్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటా: మంత్రి హరీష్ రావు
దిశ, మెదక్ బ్యూరో: దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడి వెనక కారణాలను వెలికితీయడానికి సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఈ హత్యాయత్నం ఘటన వెనక రాజకీయ కుట్ర కోణం ఉందేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. దర్యాప్తు తర్వాత స్పష్టత వస్తుందన్నారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన.. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, ఈ ఘటన గర్హనీయమని అన్నారు. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి చేరుకున్న ప్రభాకర్ రెడ్డిని మంత్రి హరీశ్‌రావు పరామర్శించారు. గాయం తీవ్రతమై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు.
ఈ ఘటనను ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తున్నదన్నారు. కత్తిపోటు కారణంగా కడుపులో గాయాలయ్యాయని అన్నారు. ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ కేడర్ ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, అధైర్యపడొద్దని, ఆయనకు అవసరమైన అన్ని రకాల ట్రీట్‌మెంట్ అందించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభాకర్‌రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు.