పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ఈసీ కీలక నిర్ణయం

by GSrikanth |
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు ఈసీ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఓట్ల లెక్కింపునకు సపరేట్‌గా అదనపు టేబుళ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత.. 8:30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో చార్మినార్ నియోజకవర్గ ఫలితాలు ముందుగా రానున్నాయి. చార్మినార్ ఫలితాలు 15 రౌండ్లలో పూర్తి కానున్నాయి. చివరగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఫలితాలు వెల్లడిస్తారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ఫలితాలు 23 రౌండ్ల తర్వాత ప్రకటిస్తారు. చార్మినార్ మినహా గ్రేటర్‌లోని మిగతా అన్ని నియోజకవర్గాల్లో 16 నుంచి 25 రౌండ్ల తర్వాత ఫలితాలు వెలువడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed