- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కేసీఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలు.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు
దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రజల మధ్య వైషమ్యాలకు ఆస్కారమిస్తున్నదని ఆరోపిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ధరణి అంశాన్ని ప్రస్తావిస్తూ అది ఉనికిలో లేకపోతే భూ సమస్యలు పెరుగుతాయని, రెవెన్యూ శాఖలో లంచాలు, అవినీతి వస్తుందని ముఖ్యమంత్రి స్థాయిలో కేసీఆర్ మాట్లాడడం ప్రభుత్వ వ్యవస్థనే ప్రశ్నార్థకం చేస్తున్నదని ఆ పార్టీ అనుబంధ విభాగం ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ సెల్ వైస్ చైర్మన్ కోదండరెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తొమ్మిదేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇప్పుడూ ఆ బాధ్యతల్లోనే ఉన్నారని, ధరణి నిర్వహణతో పాటు లాండ్ టైటిల్స్, భూరికార్డుల విషయంలో రెవెన్యూ సిబ్బందిని తప్పుపట్టడం సమంజసం కాదన్నారు.
సమాజంలో భూమి చాలా సున్నితమైన అంశమని, అసంబంధ్ధమైన అంశాలను ప్రస్తావిస్తూ రెవెన్యూ శాఖలో పనిచేస్తునన సిబ్బంది మీదకు నెపాన్ని నెట్టడం ఆ వ్యవస్థనే తప్పుపట్టడంగా ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతూ ఉన్నదని, గతంలో అధికారులపై పెట్రోలు పోసి కాల్చి చంపిన ఘటనలు చోటుచేసుకున్నాయని, వీటిని పరిగణనలోకి తీసుకుని సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యతాయుతంగా ప్రసంగించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. రెవెన్యూ సిబ్బంది పట్ల ప్రజలకున్న చిన్నచూపునకు తోడు ఇప్పుడు సీఎం స్థాయిలో కేసీఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలు సరికొత్త సమస్యలకు తావిస్తాయన్నారు.
ఇలాంటి కామెంట్లు చేయకుండా కేసీఆర్‌ను నియంత్రించాలని సీఈఓను కోదండరెడ్డి కోరారు. రెవెన్యూ మంత్రిత్వశాఖ బాధ్యతలను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. తన పరిధిలో ఉండే శాఖలోని సిబ్బందిని లంచగొండులుగా, అవినీతిపరులుగా వర్ణించడం చర్చనీయాంశంగా మారింది.