- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వై.ఎస్. వివేక కేసు.. సుప్రీం కోర్టుకు సునీత
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణను వాయిదా వెయ్యటాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్ వేసారు. దీనిని స్వీకరించిన సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ జరుపనుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు రావాలని ఇటీవల సీబీఐ నోటీసులు ఇవ్వగా అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై రెండు రోజులపాటు విచారణ జరిపిన హైకోర్టు ఈనెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యవద్దంటూ సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ సునీత గురువారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వెంటనే విచారణ పూర్తి చేసి ఉత్తర్వులు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదే విధంగా ఈనెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చెయ్యవద్దన్న హైకోర్టు ఆదేశాలపై ఆమె పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు.