- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెన్నుపోటు పొడవడంలో కేసీఆర్ దిట్ట: షర్మిల
దిశ, తెలంగాణ బ్యూరో: వెన్నుపోటు పొడవటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల విమర్శలు చేశారు. దొరకు ఢిల్లీ రాజకీయాలపై ఉన్న సోయి.. తెలంగాణ రైతులపై లేకుండా పోయిందని ఆమె గురువారం ఒక ప్రకటనలో ఫైరయ్యారు. రైతులకు పరిహారం ఎగ్గొట్టి వారికి వెన్నుపోటు పొడిచారన్నారు. గతంలో పరిహారం పేరుతో మిర్చి రైతులను నిండా ముంచారని విరుచుకుపడ్డారు. ఇప్పుడు వరి రైతులను నట్టేట ముంచాలని చూస్తున్నారని విమర్శలు చేశారు. పది రోజుల్లో పరిహారం అందిస్తామని చెప్పి నెల రోజులైనా రూపాయి ఇవ్వలేదన్నారు. అకాల వర్షాలకు 10 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా.. దొరకు దున్నపోతుపై వానపడినట్లే ఉందని మండిపడ్డారు. పంట నష్టం జరిగిన దానికి పరిహారం ప్రకటించకుండా తడిసిన ధాన్యం కొంటామని చెప్పి, మళ్లీ ఢిల్లీకి వెళ్లాడని దుయ్యబట్టారు.
నష్టపోయిన రైతుల్లో సగం మంది కౌలు రైతులున్నా.. పట్టింపు లేదన్నారు. రైతులు కన్నీరు పెడుతుంటే కల్లాల్లో ఉండాల్సిన ముఖ్యమంత్రి.. దేశ దోపిడీకి ఢిల్లీకి వెళ్లాడని షర్మిల ధ్వజమెత్తారు. దీన్ని కిసాన్ సర్కార్ అంటారా? అని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ సంపదనంతా కొల్లగొట్టి రాష్ట్రంలో గడీలు, ఢిల్లీలో కోటలు కడుతున్నారని ఆమె ఆరోపించారు. తడిసిన ధాన్యం కొనడమే కాకుండా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ పొలిటికల్ సైన్స్ చదివానని, అపరమేధావినని చెప్పుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం కట్టినా మహాద్భుతమేనని షర్మిల ఎద్దేవా చేశారు. ప్రపంచం మెచ్చిన కాళేశ్వరం కడితే.. ఒక్క వరదకే మునిగిందని సెటైర్లు వేశారు. దేశం మెచ్చిన యాదాద్రి కడితే.. చిన్నవానకే చిందరవందరగా అయిందని చురకలంటించారు. రాష్ట్రం మెచ్చిన సెక్రటేరియేట్ కడితే.. గోడలకు బీటలు వారాయని, రెండు జల్లులకే నీటి ఎత్తిపోయాల్సి వచ్చిందని, జనం మెచ్చిన పరీక్షలు పెడితే.. పేపర్ లీకులయ్యాయని, ఇవన్నీ సర్కారుకు లింకులుగా ఉన్నాయని విమర్శలు చేశారు. సచివాలయ నిర్మాణంపై దర్యాప్తు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. భవన నాణ్యతపై పరిశీలన చేయించాలని, రూ.1600 కోట్ల ఖర్చుపై శ్వేతపత్రం విడుదలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.