- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ మనవడిపై YS షర్మిల తీవ్ర విమర్శలు
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని సర్కారు బడుల్లో సౌలత్‌లు లేక, రంగయ్య మనవడు తెల్లమొహం ఏస్తే.. సీఎం కేసీఆర్ మనవడు అంగరంగ వైభవంగా పట్టాలు అందుకుంటున్నాడని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. కేసీఆర్ మనవడు, రంగయ్య మనవడు ఒకే బువ్వ తినాలి, ఒకే చదువు చదవాలి అని సీఎం గతంలో మాయ మాటలు చెప్పాడాని గుర్తుచేశారు. దొరకు మద్యం అమ్మకాల మీదున్న శ్రద్ధ పేద పిల్లల చదువులపై లేదన్నారు. తాగుబోతుల మీద ఉన్న ప్రేమ.. సర్కారీ బడుల్లో వసతుల కల్పన మీద లేదని విమర్శలు చేశారు. తాగు, తాగిపించు ఇదే దొరకు తెలిసిన రాష్ట్ర అభివృద్ధని తెలిపారు. కేసీఆర్‌కు బడుల కన్నా బార్లే ఎక్కువ అని, విద్యార్థుల కన్నా మందుబాబులే మక్కువ అని వెల్లడించారు. విద్యాభివృద్ధిపై దొర చెప్పే మాటలకు, చేతలకు పొంతనే ఉండదన్నారు. రూ.3500 కోట్లతో మన ఊరు-మన బడి అంటూ ఊదరగొట్టారని, కార్పొరేట్‌ను తలదన్నే ఎడ్యుకేషన్ అని గొప్పలు చెప్పారన్నారు.
ఏటికేటా అడ్మిషన్లు హైక్ అంటూ ఫేక్ కథలు అల్లారన్నారు. అసలు విషయం ఆరా తెస్తే దొర విద్యా వ్యవస్థ అంతా పైన పటారం, లోన లొటారం అని వివరించారు. 26 వేల పాఠశాలలకు, 12వందల స్కూళ్లను బాగుచేయడం దొర చెప్పే విద్యాభివృద్ధి అని, 3 వేల కోట్లు కేటాయించి 30 కోట్లు కూడా ఖర్చు పెట్టకపోవడం విద్యా వ్యవస్థపై ఉన్న ప్రేమ అని తెలిపారు. సగానికి సగం స్కూళ్ళలో 30 మంది విద్యార్థులు లేకపోవడం విద్యాశాఖ గొప్ప పనితనమని ఎద్దేవా చేశారు. ఏటికేటా అడ్మిషన్లు లేక మూతపడుతున్న బడులు కేసీఆర్ అభివృద్ధి పాలనకు చిహ్నాలన్నారు. 6 వేల పాఠశాలలకు "ఏకోపాధ్యాయ" ఇదేనా ప్రభుత్వ విద్య.? అని నిలదీశారు. రాష్ట్రంలో 26 వేల టీచర్స్ పోస్టులు ఖాళీగా పెట్టారని, సర్కార్ విద్యను బొంద పెట్టి.. కార్పొరేట్ విద్యకు కొమ్ముగాయడమే దొర ప్లాన్ అని పేర్కొన్నారు. పాఠశాల విద్యకు చెదలు పట్టించి.. ఉన్నత విద్యను దొర భ్రష్టు పట్టించాడన్నారు. 5 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించక వృత్తి విద్యను ఆగం చేసిన మోసగాడు కేసీఆర్ అని ఎద్దేవా చేశారు.
దొరకు మద్యం అమ్మకాల మీదున్న శ్రద్ధ పేద పిల్లల చదువులపై లేదు.
— YS Sharmila (@realyssharmila) July 4, 2023
తాగుబోతుల మీద ఉన్న ప్రేమ..సర్కారీ బడుల్లో వసతుల కల్పన మీద లేదు.
తాగు,తాగిపించు ఇదే దొరకు తెలిసిన రాష్ట్ర అభివృద్ధి.
కేసీఆర్ కు బడుల కన్నా బార్లే ఎక్కువ. విద్యార్థుల కన్నా మందుబాబులే మక్కువ.
విద్యాభివృద్ధిపై దొర చెప్పే…