BREAKING: వైఎస్ షర్మిల అరెస్ట్.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత

by Satheesh |   ( Updated:2022-11-28 15:57:54.0  )
BREAKING: వైఎస్ షర్మిల అరెస్ట్.. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్‌లో వైఎస్ షర్మిల చేపట్టినా ప్రజా ప్రస్థానం పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిల గో బ్యాక్ అంటూ ఆందోళన చేయడంతో టీఆర్ఎస్, వైఎస్సార్టీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో వరంగల్ జిల్లా చెన్నారావు పేట మండలంలోని లింగగిరి దగ్గర పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. షర్మిల అరెస్ట్‌ను నిరసిస్తూ కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అంతకుముందు షర్మిలను అరెస్ట్‌ చేసేందుకు పోలీసులు యత్నించగా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, వైఎస్సార్టీపీ కార్యకర్తలు మధ్య తోపులాట జరిగింది.

Advertisement

Next Story

Most Viewed