YouTuber Harsha Sai: హర్షసాయి బాధితురాలికి వైద్య పరీక్షలు

by Maddikunta Saikiran |
YouTuber Harsha Sai: హర్షసాయి బాధితురాలికి వైద్య పరీక్షలు
X

దిశ, శేరిలింగంపల్లి: బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి(YouTuber Harsha Sai)పైన నార్సింగి(Narsingi) పోలీసులు కేసు నమోదు చేశారు.పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, తనపై హర్షసాయి హత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఫిర్యాదులో పేర్కొంది. హర్ష సాయితో పాటు అతని తండ్రి పై సైతం బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో నార్సింగి పోలీసులు హర్ష సాయిపై 376(2), 376ఎన్, 354 సెక్షన్ల కింద రేప్ కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఆమెను మంగళవారం రాత్రి కొండాపూర్(Kondapur) లోని రంగారెడ్డి(Rangareddy) జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకువచ్చి పరీక్షలు జరిపించారు. అనంతరం ఆమెను సఖి కేంద్రాని(Sakhi Center)కి తరలించారు.

Next Story

Most Viewed