- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కారుపై రొమాన్స్.. స్పందించిన వీసీ సజ్జనార్ (వీడియో)

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లోని పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవే పై కారులో వెళ్తున్న ఓ జంట కారు సన్ రూఫ్ ద్వారా బయటకు వచ్చి ముద్దులు పెట్టుకుంటూ రొమాన్స్ చేసుకుంటూ షికారు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై నెటినట్లు కొందరు ఏమో వారి ఇష్టం అని సమర్ధించారు. మరికొందరు దీనిపై హైదరాబాద్ పోలీసులకు ట్విట్టర్ లో ఫిర్యాదు చేశారు. ఈ వీడియో పై ఇవాళ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వైరల్ వీడియోను పోస్ట్ చేశారు. ‘స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివారిని ఇబ్బందులను గురిచేసేలా యువత ఇలా ప్రవర్తించడం సరికాదు. స్వేచ్ఛ.. ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ.. వారిని ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. బహిరంగ ప్రదేశాలు, రహదారులపై చేసే ఈ చేష్టలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.’ అని ట్వీట్ చేశారు.
Next Story