నక్సలైట్లకు అడ్డ అయిన తెలంగాణలోని ఆ గ్రామం.. ఇఫ్పుడు సైనికుల కేంద్రంగా ఎలా మారింది?

by Vennela |
నక్సలైట్లకు అడ్డ అయిన తెలంగాణలోని ఆ గ్రామం.. ఇఫ్పుడు సైనికుల కేంద్రంగా ఎలా మారింది?
X

దిశ, వెబ్‌డెస్క్: Naxalites: ఒకప్పటి తెలంగాణ పల్లెల పరిస్థితి వేరు..ఇప్పుడు వేరు. ఇప్పుడు పల్లెలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. ఇందుకు ఊదాహరణ పూర్వపు నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని తిప్పాపూర్(thippapur) గ్రామం. ఈ గ్రామం ఒక్కప్పుడు నక్సలిజానికి పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఆ గ్రామం రూపురేఖలే మారిపోయాయి. ఆ గ్రామంలోని యువకులంతా ఇప్పుడు దేశ సేవ చేసేందుకు ఆర్మీ(Army)బాట పట్టారు. ఒక్కప్పుడు నక్సలిజా(Naxalites)నికి పెట్టింది పేరుగా ఉన్న ఆ గ్రామం ఇప్పుడు సైనికుల గ్రామంగా మారిపోయింది. ఇప్పటికే ఆ గ్రామంలోని 18 మంది యువకులు ఆర్మీ(Army)లో చేరారు. మరి నక్సలిజం నుంచి ఆర్మీ వైపు అడుగులు ఎలా పడ్డాయి? తిప్పాపూర్ గ్రామం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

తెలంగాణ(telangana)లో ఒకప్పుడు నక్సలిజం ప్రభావం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నక్సలిజం ఎక్కువ. ఆ సమయంలో ఎందరో విప్లవ సాహిత్యానికి ఆకర్షితులై కుటుంబాలను వదిలి అడవుల బాట పట్టారు. ఎంతోమంది విద్యావంతులు కూడా నక్సలిజానికి ఆకర్షితులయ్యారు. దీంతో వారి బలం బాగా పెరిగింది. తెలంగాణలోనే కాదు పక్క రాష్ట్రాల్లోనూ వారి పట్టు ఉండేది. ఎంతలా అంటే ఆ ప్రాంతాల పేర్లు చెప్పగానే పోలీసులు సైతం వణికిపోయేవారు.

తర్వాత కాలంలో క్రమంగా నక్సలిజం తగ్గుతూ వచ్చింది. అటవి ప్రాంతాగ్రామాల్లోని యువత నక్సలిజం వైపు ఆకర్షితులు కాకుండా ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి. వారికి అవగాహన కల్పించాయి. అదే సమయంలో నక్సలైట్ల ఏరివేతను ముమ్మరం చేశాయి. దీంతో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఒక్కప్పుడు నక్సలైట్లకు కంచుకోటగా ఉన్న గ్రామాలు.. ఇప్పుడు ఆర్బీ సైనికులకు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. అందుకు ఉదాహరణ నిజామాబాద్ జిల్లాలోని తిప్పాపూర్ గ్రామం.

తిప్పాపూర్ గ్రామం ఉమ్మడ నిజామాబాద్ జిల్లా ఇప్పుడు కామారెడ్డి(kamareddy) జిల్లా భిక్కనూర్(bikhanoor) మండలంలో ఉంది. ఈ గ్రామానికి చెందిన చాలా మంది యువకులు 1980 నుంచి 1990 మధ్య కాలంలో నక్సలైట్లలో చేరారు. ఇంటికో నక్సలైట్ గా ఆ గ్రామం మారింది. అంతేకాదు గ్రామం నడిబొడ్డున అమరవీరుల స్మారక స్థూపాన్ని కూడా నిర్మించారు. అప్పట్లో నలుగురు అధికారులను కిడ్నాప్ చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించారు. ఒక దశాబ్ద కాలంపాటు తిప్పాపూర్(thippapur) గ్రామం నక్సలైట్లకు అడ్డాగా మారింది. కాలం మారింది. కొన్ని రోజుల తర్వాత వారిలో మార్పు వచ్చింది. 1990లో ఆగ్రామానికి చెందిన నలుగురు యువకులను పోలీసులు ఒకసారి ఎన్ కౌంటర్ చేశారు. ఆ గ్రామ ప్రజలతోనే అమరవీరుల స్థూపాన్ని(Martyrs' Monument) కూల్చివేయించారు. అప్పటి నుంచి తిప్పాపూర్ గ్రామంపై పోలీసుల నిఘా పెరిగింది. గ్రామాన్ని నిర్భంధించడంతో నక్సలిజం ప్రభావం తగ్గింది. యువతలో కొత్త ఆలోచనలు వచ్చాయి.

ఎన్ కౌంటర్ తర్వాత 1991లో గ్రామానికి చెందిన అశోక్ (Ashok)అనే యువకుడు ఇండియన్ ఆర్మీ(Indian Army)లో చేరాడు. ఈ విషయాన్ని తెలిసి అతన్ని నక్సలైట్లు పిలిచారు. రాష్ట్ర పోలీస్ శాఖలో చేరవద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అతను ఆర్మీలో చేరారు. అశోక్ చూసి మరికొంతమంది ఆర్మీ బాటపట్టారు. ఆ విధంగా ఒకరి తర్వాత ఒకరు ఇప్పటి వరకు 18 మంది ఆర్మీలో చేరారు. మరో 30 మంది ఆర్మీలోకి వెళ్లేందుకు ట్రైనింగ్ తీసుకుంటున్నారు.

ఒకప్పుడు నక్సలైట్లకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న తిప్పాపూర్(thippapur) గ్రామం..నేడు ఆర్మీ(Army) జవాన్ల కంచుకోటగా మారింది. గతంలో ఇంటికొక నక్సలైట్ ఉంటే ఇప్పుడు ఇంటికో జవాన్ ఉన్నారు. దీంతో ఇప్పుడా గ్రామ రూపరేఖలే మారిపోయాయి. ఆ గ్రామ ప్రజలు ఇప్పుడు ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నారు.



Next Story

Most Viewed