Ravindra Naik : రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు : - మాజీ మంత్రి రవీంద్రనాయక్

by Y. Venkata Narasimha Reddy |
Ravindra Naik : రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు : - మాజీ మంత్రి రవీంద్రనాయక్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని విమర్శించే నైతిక హక్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేటీఆర్ లకు లేదని మాజీ మంత్రి డి. రవీంద్రనాయక్(Former Minister Ravindra Naik) అన్నారు. అసమానతలు, తారతమ్యాలు లేని ప్రపంచం కోసం రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేపట్టడం అభినందనీయమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కులగణన విషయంలో బీఆర్ఎస్, బీజేపీ అనుకూలమో వ్యతిరేకమో స్పష్టం చేయాలన్నారు. ఇంత మంచి కార్యక్రమం చేపడితే ఓర్వలేక అవినీతి చక్రవర్తి కేటీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి ఎన్నో కుంభకోణాలకు పాల్పడ్డ కేటీఆర్ ను, కేంద్ర నిఘా సంస్థల పనితీరును సమీక్షించే అధికారాలు కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉన్న నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరించారన్నారు. తెలంగాణ బిడ్డల త్యాగాలకు చలించి సోనియమ్మ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఇవ్వాళ కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉండేవారో గుర్తు చేసుకోవాలన్నారు. గత పదేళ్లలో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి ప్రజలను మోసం చేశాయన్నారు.

మోడీ ప్రతి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇంటింటికి 15 పదిహేను లక్షలు, సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ వాగ్ధానాలు ఎక్కడపోయాయో చెప్పాలని నిలదిశారు. ఇక రాష్ట్రంలో నీరో చక్రవర్తిగా వ్యవహరించిన కేసీఆర్ దళిత సీఎం, ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం, నీళ్లు, నిధులు, నియామాకాలు, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం వంటి వాగ్దానాలను అమలు చేయడకుండా ఏ గూటిలో దాచారో కేటీఆర్, కిషన్ రెడ్డి ప్రజలకు చెప్పాలన్నారు. స్వయంగా ప్రధాని మోడీ తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అయ్యిందని అనేక సార్లు చెప్పారని, కానీ ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాయని, ఈ పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Advertisement

Next Story