రేవంత్ రెడ్డి తీరుపై యాదవ సంఘాల ఫైర్.. గాంధీ భవన్ వద్ద హైటెన్షన్!

by Sathputhe Rajesh |
రేవంత్ రెడ్డి తీరుపై యాదవ సంఘాల ఫైర్.. గాంధీ భవన్ వద్ద హైటెన్షన్!
X

దిశ,డైనమిక్ బ్యూరో: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై యాదవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పేందుకు విధించిన డెడ్ లైన్ ఇవాళ్టితో ముగియనుంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించిన యాదవ సంఘాలు, గొల్ల కురుమల నేతలు రేవంత్ క్షమాపణలు చెప్పకపోవడంతో ఇవాళ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

దున్నపోతును తీసుకుని గాంధీభవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ కు మద్దతుగా దారిపొడవున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్తతకు దారి తీయకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సైతం వెనక్కి తగ్గడం లేదు. యాదవ సంఘాలు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేసినా ఆయన క్షమాపణలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు.

దీంతో ఈ వ్యవహారంలో రాజకీయం మరింత హీటెక్కుతోంది. కాగా రేవంత్ రెడ్డిపై యాదవ సంఘాలు మండిపడుతుంటే కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్‌కి ఆశించిన స్థాయిలో మద్దతు లంభిచండం లేదనే చర్చ జరుగుతోంది. అంజన్ కుమార్ యాదవ్ వంటి ఒకరిద్దరు నేతలు మినహా సీనియర్ నేతలెవరూ ఈ విషయంలో కౌంటర్ ఎటాక్ చేయకపోవడం గాంధీ భవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed