- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నెట్టింట్లో చక్కర్లుకొడుతున్న 'చెక్క ట్రెడ్‌మిల్'... కేటీఆర్ దాకా పాకింది!
దిశ, వెబ్‌డెస్క్ః ప్రస్తుతం తిండి ఎంత ఫ్యాషన్ అయ్యిందో వ్యాయామం అంతకంటే ఎక్కువ తప్పనిసరి అయ్యింది. జీవన శైలిలో వచ్చిన మార్పుల దృష్ట్యా జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం సర్వసాధారణమైపోయింది. ఇక, జిమ్‌లో మొట్టమొదట కనిపించేది ట్రెడ్‌మిల్. దానిపైన గంటలు కొద్దీ టైమ్ గడిపితే, కొవ్వు కరిగి, తద్వారా శరీరం ఫిట్‌గా ఉంటుంది. అయితే, ట్రెడ్‌మిల్‌కి విద్యుత్తు తప్పనిసరి, అలాగే, సామాన్యుడు కొనుక్కోలేనంత ధర కూడా. కాబట్టి, తెలంగాణాకు చెందిన ఓ వ్యక్తి అద్భుతమైన ఆలోచన చేశాడు. అత్యుత్తమ ఆవిష్కరణతో చెక్క ట్రెడ్‌మిల్‌ను డిజైన్ చేశాడు. వీల్స్ పెట్టి చెక్క ముక్కలతో చేసిన ఈ నయా ఉడెన్ ట్రెడ్ మిల్ తయారీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసినవారు 'సూపర్' అంటూ ప్రశంసిస్తున్నారు. అంతేనా, తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఈ వ్యక్తిపై ప్రశంసలు కురిపించారు. కేటీఆర్, ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ, ఇలా రాశారు - 'అద్భుతంగా ఉంది. ఈ ఐడియాను మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఎవరో కనుక్కోండి' అంటూ ఊతమిచ్చారు. ఇక, ప్రతి ఇంట్లో ఈ చెక్క ట్రెడ్‌మిల్ ఉంటే అందరికీ ఆరోగ్యమే..!!
Amazing treadmill that works without power. pic.twitter.com/iTOVuzj6va
— Arunn Bhagavathula చి లిపి (@ArunBee) March 17, 2022
Wow! 👏👏 @TWorksHyd please connect & help him scale up https://t.co/FVgeHzsQx8
— KTR (@KTRTRS) March 18, 2022