Seethakka : మహిళా సంక్షేమ విధానాలపై అధ్యయన కమిటీ : మంత్రి సీతక్క

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2025-03-01 09:33:59.0  )
Seethakka : మహిళా సంక్షేమ విధానాలపై అధ్యయన కమిటీ : మంత్రి సీతక్క
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళా సాధికారత(Women Empowerment)కోసం కొత్త కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాల మహిళా సంక్షేమ విధానాల(Women Welfare Policies)అధ్యయనం(Study) కోసం ఉన్నత స్థాయి కమిటీ(High-level committee) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహణపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన మహిళాభ్యున్నతి పథకాల అమలు పురోగతిని సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాల కార్యక్రమాల ప్రగతి వివరాలను పరిశీలించారు.

మహిళా సాధికారత కోసం కొత్త కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాల మహిళా సంక్షేమ విధానాల అధ్యయనం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందించేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి సీతక్క తెలిపారు.



Next Story