దళితుడిపై మహిళా సర్పంచ్ దాడి! (వీడియో)

by Nagaya |   ( Updated:2022-12-15 06:43:15.0  )
దళితుడిపై మహిళా సర్పంచ్ దాడి! (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: దళిత బంధు పేరుతో సీఎం కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నాడని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసిన ఆయన అందులో ఓ వ్యక్తిపై మహిళ దాడి చేస్తుట్టుగా ఉంది. అయితే దాడికి పాల్పడిన సదరు మహిళ గ్రామ సర్పంచ్ గా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షేర్ చేస్తూ 'దళిత బంధు పేరుతో కేసీఆర్ మోసం చేస్తుంటే మీ అగ్రవర్ణ సర్పంచులేమో పేద దళితులపై నార్కెట్ పల్లిలో ఎలా దాడి చేస్తున్నారో చూడండి. పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన రెండు రోజులు గడుస్తున్నా వారు మీ అండ చూసుకుని ఇంకా స్పందించడం లేదు. ఈ సర్పంచ్‌ను వెంటనే అరెస్ట్ చేసి ఎస్ఐని విధుల నుంచి తొలగించాలి' అని డిమాండ్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు మహిళను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed