Wine Shops: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఆ 48 గంటలు మూతపడనున్న వైన్స్‌లు

by Shiva |
Wine Shops: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఆ 48 గంటలు మూతపడనున్న వైన్స్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: మండు వేసవిలో చల్లని బీరు తాగి ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయిన మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ సక్రమంగా జరిగిలా రెండు రోజుల పాటు డ్రై డే ప్రకటించింది. ఈ మేరకు మే 11 సాయంత్రం 6 గంటల నుంచి మే 13 సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు మూతపడబోతున్నాయి. అదేవిధంగా ఎన్నికల ఫలితాల వెల్లడయ్యే జూన్ 4న కూడా వైన్ షాపులు మూసి ఉంటాయని ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వైన్ షాపులతో పాటుగా వివిధ జిల్లాలు, నగరాల్లో కల్లు కాపౌండ్‌లో కూడా క్లోజ్ అవుతాయి. అయితే, శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని డ్యూటీ ఫ్రీ లిక్కర్ మార్ట్ మాత్రం తెరిచే ఉండనుంది.





Advertisement
Next Story

Most Viewed