- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెయ్యి సార్లు అయిన సీఎంను కలుస్తా.. చచ్చే వరకు బీఆర్ఎస్‌లోనే ఉంటా: ఎమ్మెల్యే గూడెం
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి మేదర్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావులు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రోటోకాల్ సమస్య, నియోజకవర్గ అభివృద్ధికి నిధుల గురించి చర్చించారు. కాగా వీరు సీఎం రేవంత్ ను కలవడంతో ఆ నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ ఎన్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ నిన్నటి నుంచి తీవ్ర చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి పలు పత్రికలలో కూడా బ్యానర్ వార్తలు ప్రచురితం అయ్యాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు ఈ రోజు తెలంగాణ భవన్ లో ప్రేప్ మీట్ ఏర్పాటు చేసి.. సీఎంను ఎందుకు కలవాల్సి వచ్చింది అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర, నియోజకవర్గ ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశాము అంతే తప్ప మరే ఉద్దేశం లేదు. కొందరు వ్యక్తులు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వెయ్యి సార్లు అయిన కలుస్తామని చెప్పుకొచ్చారు. అలాగే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. తాను చచ్చేంత రవకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తేల్చి చెప్పారు.