Rashmika Mandanna : రష్మిక మందన్నను కూడా అరెస్టు చేస్తారా..?

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-13 12:31:14.0  )
Rashmika Mandanna : రష్మిక మందన్నను కూడా అరెస్టు చేస్తారా..?
X

దిశ, వెబ్ డెస్క్ : పుష్ప 2 మూవీ ప్రిమియర్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ధ జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయిన కేసులో హీరో అల్లు అర్జున్(Allu Arjun)ను అరెస్టు(Arrest) చేసిన పోలీసులు హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ను కూడా అరెస్టు(Arrest) చేస్తారా ? అన్న సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. తొక్కిసలాట జరిగిన రోజు రష్మిక కూడా థియేటర్‌లో ఉందని, అల్లు అర్జున్, చిత్రబృందంతో కలిసి ఆమె సినిమా చూసిందని గుర్తు చేసుకుంటున్నారు.

కేసులో హీరో అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన పోలీసులు హీరోయిన్ నూ కూడా అరెస్టు చేస్తారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశ్నలు వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ కు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు 14రోజుల రిమాండ్ విధించగా, ఆయనను చంచల్ గూడా జైలుకు తరలించారు. అంతలోనే హైకోర్టు క్వాష్ పిటిషన్ వాదనలు విని ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరీ చేయడంతో అల్లు అర్జున్ జైలుకెళ్లే పరిస్థితి తప్పినట్లయ్యింది.

Advertisement

Next Story

Most Viewed