- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ కాబోతుందా..? కేటీఆర్ వ్యాఖ్యల ఉద్దేశం ఇదేనా.?
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ రాజకీయాల కోసం భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చిన సంగతి తెలిసిందే. అయితే పేరు మార్పుపై పార్టీలో సీనియర్లకు, కార్యకర్తలకు ఇష్టం లేదని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడిచింది. దీంతో పార్టీ పేరు టీఆర్ఎస్‌గానే ఉంటేనే బాంగుంటుందని పార్టీ వర్గాల్లో గతంలో చర్చలు జరిగాయి. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. హ్యాట్రిక్ విజయం మిస్ అయిన గులాబీ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి పాత పేరునే కొనసాగించాలని గతంలో పార్టీ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు పాత పేరు కొనసాగడంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇటీవల లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో మాజీ మంత్రి కేటీఆర్‌కు సూచించారని సమచారం. దీంతో బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలన్న డిమాండ్ అనూహ్యంగా తెరపైకి వచ్చింది.
బీఆర్ఎస్ పేరుతో కలిసి రావట్లేదు..?
బీఆర్ఎస్ కొత్త పేరుతో పార్టీకి కలిసిరావట్లేదని అధిష్టానానికి అర్థమైనట్లు ఉంది. పేరు మార్పుతో ప్రజలకు దూరమయ్యే భావన అధిష్టానానికి కలిగినట్లు సమాచారం. దీంతో అసెంబ్లీ ఓటమితో ఉన్న పార్టీని, లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయడానికి అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని నిలువరించాలంటే కాంగ్రెస్ పార్టీతో అవ్వదని, ప్రాంతీయ పార్టీలే బీజేపీని నిలువరించగలవని నిన్న తెలంగాణ భవన్‌లో లోక్ సభ సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. గులాబీ బాస్ కేసీఆర్ లాంటి నాయకుల వల్లే బీజేపీని నిలువరించగలమని అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో పోటీలోలేదని వాదన!
బీఆర్ఎస్ జాతీయ పార్టీ చెప్పుకొచ్చిన అధిష్టానం.. కేటీఆర్ పరోక్షంగా ప్రాంతీయ పార్టీ అనే వ్యాఖ్యలు చేయడంతో పోలీటికల్ సర్కీల్లో పేరు మార్పులపై చర్చలు జరిగాయి. బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదా అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ కాబోతుందా..? పార్టీకి పాత పేరు కొనసాగించడం కోసమే ఈ విధంగా మాట్లాడారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లోక్ సభ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో పోటీకి లేనట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో పార్టీ బలోపేతం చేయడానికి ప్రయత్నించిన వెనక్కి తగ్గినట్లు సమాచారం.