- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇలా వెళితే ప్రమాదాలు జరగవా..? టీజీఎస్ఆర్టీసీ ఎండీ ఆసక్తికర ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: ఇలా వెళితే ప్రమాదాలు (accidents) జరగవా? అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (TGSRTC MD VC Sajjanar) ట్వీట్ (Tweet) చేశారు. సోషల్ మీడియా (Social Media)లో ఎప్పుడు యాక్టివ్ (Active)గా ఉండే ఆయన.. ఎల్లప్పుడూ సైబర్ నేరాలపై (Cyber Crimes), రోడ్డు ప్రమాదాలపై (Road Accidents) ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆసక్తికర పోస్ట్ (INtresting Post) పెట్టారు. ఇందులో కొందరు యువత ట్రిపుల్ రైడింగ్ (triple riding) చేస్తూ.. పోలీసులు (Police) చాలాన్ (Challane) కోసం ఫోటోలు (Photos) తీయకుండా ప్రమాదకరంగా వెళుతున్నారు. ఎందుకీ విన్యాసం (stunt).. మితిమీరితే ప్రమాదం (danger) అంటూ ఓ వార్త పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.
దీనిపై ఆయన.. తల్లితండ్రుల్లారా (Parents) మీ పిల్లలకు వాహనాలు కొనిచ్చి మురిసిపోవడం కాదు.. రోడ్లపై (roads) వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ (follow traffic rules) పాటిస్తున్నారా? లేదా? అని తెలుసుకోండి అని అన్నారు. అలాగే యధేచ్చగా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ.. తప్పించుకునేందుకు ఇలా రకరకాల విన్యాసాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగితే ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించండి అని చెప్పారు. ఇక డ్రైవింగ్ విషయంలో యువత బాధ్యతగా వ్యవహరించాలని, త్రిపుల్ డ్రైవింగ్ యమ డేంజర్ అంటూ.. సరదాగా మీరు చేసే ఈ పని ప్రాణాలకే ప్రమాదం అని హెచ్చరించారు. కాగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ గా ఉన్న సజ్జనార్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు సామాజిక అవగాహన కల్పిస్తుంటారు.