- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ktr vs Congress : కేటీఆర్.. మూసీ ప్రక్షాళన చేస్తామంటే నీకెందుకు బాధ? టీ కాంగ్రెస్ ప్రశ్నలు
దిశ, డైనమిక్ బ్యూరో: మూసీ నది సుందరీకరణ నేపథ్యంలో 1.50 లక్షల కోట్లు రూపాయలతో అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా సీఎంను విమర్శించారు. దీంతో కేటీఆర్ కామెంట్స్‌పై టీ కాంగ్రెస్ తాజాగా ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేసింది.
ట్విట్టర్ టిల్లూకు కొన్ని ప్రశ్నలు.. మూసీ ప్రక్షాళన చేస్తామంటే నీకెందుకు బాధవుతోంది? మూసీ కలుషితంతో ప్రజల ఆరోగ్యం పై పడుతోన్న ప్రభావం ఎంత? ఆ ప్రభావం వల్ల రోగాల బారిన పడి వైద్యానికి ప్రజలు ప్రతి ఏటా తెలియకుండా చేస్తోన్న ఖర్చు ఎన్నివేల కోట్లు? మూసీ కింద రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఆయకట్టు ఉన్న విషయం అమెరికాలో “ఆ పని” చేసొచ్చిన నీకు తెలవకపోవడంలో ఆశ్చర్యం లేదు. మూసీ సుందరీకరణ తో హైదరాబాద్ కు పెరిగే బ్రాండ్ ఇమేజ్ విలువ నువ్వు అంచనా కట్టగలవా? పర్యాటకం పెరగడం వల్ల ఆదాయం వస్తుందన్న విషయం నీకు తెలుసా? దాని పరీవాహకంలో కొన్ని వేల మంది పొందే ఉపాధి విలువ ఎంతో నీకు తెలుసా? నీ దృష్టిలో అభివృద్ధి అంటే రియల్ ఎస్టేట్ కంపెనీలు కట్టే అద్దాల మేడలేనా? మూసీ ప్రక్షాళనను కాళేశ్వరంతో పోల్చి.. మీ దోపిడీని మరోసారి గుర్తు చేస్తున్నావా? నీ పోలికతో కూలిన కాళేశ్వరమే మళ్లీ కళ్ల ముందు కనిపిస్తుంది నీకర్థమవుతుందా? అని ప్రశ్నల వర్షం కురిపించింది.