పొంగులేటి, జూపల్లి తర్వాత కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు?

by Sathputhe Rajesh |   ( Updated:2023-04-11 03:06:20.0  )
పొంగులేటి, జూపల్లి తర్వాత కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఎవరు?
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాజీ మంత్రి జూపల్లి, మాజీ ఎంపీ పొంగులేటిని సస్పెండ్ చేసిన తర్వాత.. బీఆర్ఎస్‌లో ఏం జరగబోతున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఏ జిల్లా అసమ్మతిపై సీఎం ఫోకస్ పెడతారు? నెక్ట్స్ టార్గెట్ ఎవరు? అనేది చర్చనీయాంశంగా మారింది. అన్ని చోట్ల ఇదే ఫార్మూలాను అప్లయ్ చేస్తారా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది. అసమ్మతి లీడర్లను ఎలా దారిలోకి తెచ్చుకుంటారు? బుజ్జగిస్తారా? భయపెడుతారా? అనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్నది.

ఎన్నికల నాటికి ఫుల్ స్టాప్ పెట్టేలా..

సెప్టెంబరు తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూలు వచ్చే చాన్స్ ఉంది. ఈ లోపు అసమ్మతికి ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ముందుగా బుజ్జగించాలని, వినకపోతే బెదిరించాలని, అయినా దారిలోకి రాకపోతే వేటు వేయాలని చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. అందులో భాగంగా అసమ్మతి లీడర్లతో సంప్రదింపులు జరుపుతున్నారని, కొందరితోనైతే నేరుగా సీఎం కేసీఆర్ మాట్లాడి, వారి రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇస్తున్నట్లు తెలిసింది. మరికొందరితో కేటీఆర్ మాట్లాడుతున్నట్టు సమాచారం. రెండు మూడు నెలల్లో పార్టీలో అసమ్మతి లేకుండా చూడాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది.

అందరిపై వేటు తప్పదా?

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో అసమ్మతి లీడర్లు ఉన్నారు. వారంతా సమయం వచ్చిన ప్రతిసారీ తమ అసమ్మతి గళాన్ని విప్పుతున్నారు. కొందరు బయటికి మాట్లాడుతుండగా, ఇంకొందరు మాత్రం తమ యాక్టివిటీస్ ద్వారా నిరసన తెలుపుతున్నారు. వీరందరి పట్ల సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందరిని పార్టీ నుంచి బయటికి పంపుతారు? ఎందరిని బుజ్జగిస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. పార్టీలో సీఎం కేసీఆర్ మాటకు తిరుగుండదని, ఏం చెబితే అది వినాల్సిందేనని లీడర్లు గొప్పగా చెబుతుంటారు. కానీ జూపల్లి, పొంగులేటిలకు నచ్చజెప్పడంలో విఫలమయ్యారని, అందుకే వారు తమ అసమ్మతిని కొనసాగించారనే చర్చ జరుగుతున్నది.

హైకమాండే కారణం

గులాబీ పార్టీ రెండుసార్లు అధికారంలోకి రాగా, ఫస్ట్ టర్మ్‌లో అసమ్మతి కనిపించలేదు. సెకండ్ టర్మ్‌లో మాత్రం రాష్ట్రవ్యాప్తంగా అసమ్మతి నెలకొన్నది. ఇందుకు పార్టీ అధిష్టానం తీరే కారణమని విమర్శలున్నాయి. కొన్ని చోట్ల విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడంతో అసమ్మతి మొదలైంది. ఇంకొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వడం, సీనియర్ లీడర్లను పట్టించుకోకవపోడంతో అసమ్మతి రాగాలు మొదలయ్యాయి. ఇతర పార్టీలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్ లీడర్లను పార్టీలో చేర్చుకున్నారు. ఎన్నికల నాటికి ఏదో ఒక పదవినో, లేకపోతే ఎమ్మెల్యే సీటు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చాలా మందికి పదవి దక్కలేదు. దీంతో వారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.

అప్పటి చీలికలే కారణం

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత సభలో విపక్ష పార్టీల్లో చీలిక తీసుకొచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మందిని, టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆ 14 స్థానాల్లో బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన అభ్యర్థులు అసమ్మతి లీడర్లుగా మారారు. వీరికి ఏదో ఒక పదవి ఇచ్చి సర్దిచెప్పాల్సిన అధిష్టానం, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని తెలుస్తున్నది. దీంతో వారంతా ఇతర పార్టీలోకి వెళ్లేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నారు.

సెగ్మెంట్ల వారీగా అసమ్మతి లీడర్ల జాబితా

సెగ్మెంట్ లీడర్లు

బోథ్ : ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు వర్సెస్ మాజీ ఎంపీ నగేశ్

ఖానాపూర్ : ఎమ్మెల్యే రేఖానాయక్ వర్సెస్ జాన్సన్

నిర్మల్ : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వర్సెస్ శ్రీహరి రావు

మెదక్ : ఎమెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వర్సెస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు

నర్సాపూర్ : ఎమ్మెల్యే మధన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి

స్టేషన్ ఘన్ పూర్ : ఎమ్మెల్యే రాజయ్య వర్సెస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

జనగామ : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి

భూపాలపల్లి : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ మధుసుధనాచారి

వరంగల్ తూర్పు : నన్నపనేని నరేందర్ వర్సెస్ ఎర్రబెల్లి వర్గీయులు

డోర్నకల్ : ఎమ్మెల్యే రెడ్యానాయక్ వర్సెస్ మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : ఎమ్మెల్యే శంకర్ నాయక్ వర్సెస్ ఎంపీ కవిత

పాలేరు : ఎమ్మెల్యే కందుల ఉపేందర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఇల్లందు : ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ వర్సెస్ జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

వైరా : ఎమ్మెల్యే రాముల నాయక్ వర్సెస్ మదన్ లాల్

పినపాక : ఎమ్మెల్యే రేగా కాంతారావు వర్సెస్ పాయం వెంకటేశ్వర్లు

అశ్వరావు పేట : ఎమ్మెల్యే మెచ్చనాగేశ్వరావు వర్సెస్ జారే ఆదినారాయణ

కరీంనగర్ : మంత్రి గంగుల కమలాకర్ రావు వర్సెస్ రవీందర్ సింగ్

నల్గొండ : ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వర్సెస్ పిల్లి రామరాజు

కల్వకుర్తి : ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్సెస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి

నకిరేకల్ : ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

మునుగోడు : ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

ఆలేరు : ఎమ్మెల్యే గొంగిడి సునీత వర్సెస్ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్

నాగార్జున సాగర్ : ఎమ్మెల్యే భగత్ వర్సెస్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి

కోదాడ : ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వేనంపల్లి చందర్ రావు, శశిధర్ రెడ్డి

తాండూర్ : ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

వికారాబాద్ : ఎమ్మెల్యే ఆనంద్ వర్సెస్ లోకల్ లీడర్లు

మహేశ్వరం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి

కుత్బుల్లాపూర్ : ఎమ్మెల్యే వివేకానంద్ వర్సెస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఉప్పల్ : ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి వర్సెస్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్

ఎల్బీ నగర్ : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్సెస్ రామ్మోహన్ గౌడ్ (2014, 18 టీఆర్ఎస్ అభ్యర్థి)

Also Read: వేటేసినా.. వెంటాడడమే.! వారిద్దరి కదలికలపై గులాబీ బాస్ ఫోకస్..

Advertisement

Next Story

Most Viewed