- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
శుభాకార్యానికి వెళ్లి వచ్చే సరికి ఇల్లు గుల్ల

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మరోసారి దొంగలు హల్ చల్ చేశారు. శుభాకార్యానికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో సొత్తును అపహరించుకుపోయారు. ఇంట్లో ఉన్న బంగారం, వెండి, నగదు దోచుకెళ్లిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శివసాయినగర్‌లో గత రాత్రి ఓ ఇంట్లో దొంగలుపడి 5 తులాల బంగారం, 20 తులాల వెండి, ట్యాబ్‌తో పాటు కొంత నగదును దోచుకువెళ్లారు.
పట్టణంలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లిన కుటుంబసభ్యులు రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. క్లూస్ టీం ద్వారా మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.