Govt Jobs: 25 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు? ఉద్యోగాలపై రాణి రుద్రమ ఆసక్తికర వ్యాఖ్యలు

by Ramesh N |
Govt Jobs: 25 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ఇంకెప్పుడు? ఉద్యోగాలపై రాణి రుద్రమ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: అధికారంలో వచ్చిన 6 నెలల్లో మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని గప్పాలు పలికి రేవంత్ సర్కార్ ఇప్పటికీ ఉలుకుపలుకు లేదని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆమె తాజాగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఫస్ట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి.. రెండు దఫాలుగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆమె గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి ఆఫ్ ఇయర్ గడిచిపోయిందని, ఇప్పటికే లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి ఉండాలని తెలిపారు. ఈ లక్ష ఉద్యోగాల్లో 25 వేల ఉద్యోగాలు టీచర్స్ ఉద్యోగాలని, కానీ ఇప్పటి వరకు భర్తీ చేయలేదని మండిపడ్డారు.

ఉపాధ్యాయులను రిక్రూట్ చేసుకోకపోతే తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ప్రజా పాలన ఎలా అందిస్తారని నిలదీశారు. ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.. ఏమైందని గుర్తుచేశారు. విద్యాశాఖ బడ్జెట్ ను 6 % నుంచి 15% పెంచుతామని దొంగ హామీ ఇచ్చారు దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. నోటిఫికేషన్ల పేరుతో గత బీఆర్ఎస్ తరహాలోనే ఇప్పటి కాంగ్రెస్ నిరుద్యోగులను దగా చేస్తుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed