- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారంలోకి రాగానే 2లక్షల ఉద్యోగాలు.. నిరుద్యోగులకు బండి కీలక హామీ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తామని, యూపీఎస్సీ తరహాలో వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను గుర్తించి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని, లీకేజీకి ఆస్కారం లేకుండా పకడ్బందీగా పోటీ పరీక్షలను నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ బీజేపీ పక్షాన హామీ ఇస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, బాధ్యుడైన ఐటీ శాఖ మంత్రిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన ప్రతీ నిరుద్యోగికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలనే డిమాండ్ తో ఈనెల 11న ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రంలోని సంగారెడ్డిలో ‘నిరుద్యోగ మార్చ్’ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నిరుద్యోగ మార్చ్‌కు నిరుద్యోగులు, ప్రజాస్వామికవాదులంతా భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులను దారణంగా మోసం చేసిన తీరును ఈ మార్చ్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతామన్నారు. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి పదవికి రాజీనామా చేసేదాకా ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులందరికీ రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా నిరుద్యోగుల పక్షాన పోరాడతామని సంజయ్ పిలుపునిచ్చారు. అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ అనంతరం వచ్చే నెలలో హైదరాబాద్ లో ‘మిలియన్ మార్చ్’ నిర్వహించి ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తామని సంజయ్ పేర్కొన్నారు.